Mass Jathara: మాస్ జాతర ప్రీ రిలీజ్ ఈవెంట్ అప్డేట్

హిట్టూ ఫ్లాపుతో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ కెరీర్లో ముందుకెళ్లే హీరోల్లో మాస్ మహారాజా రవితేజ(Raviteja) కూడా ఒకరు. అయితే గత కొన్ని సినిమాలుగా రవితేజకు సరైన సక్సెస్ దక్కడం లేదు. రవితేజ ఆఖరిగా హిట్ అందుకున్నది ధమాకా(Dhamaka) మూవీతోనే. ఎప్పటికప్పుడు రవితేజ సక్సెస్ కోసం ప్రయత్నిస్తున్నప్పటికీ ఆయనకు సక్సెస్ మాత్రం దక్కడం లేదు.
రవితేజ చేతిలో ప్రస్తుతం పలు సినిమాలుండగా, మాస్ జాతర అనే సినిమా రిలీజ్ కు రెడీ అవుతుంది. సామజవరగమన(Samajavaragamana) ఫేమ్ భాను భోగవరపు(Bhanu Bhogavarapu) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ ఎన్నో వాయిదాల తర్వాత అక్టోబర్ 31న రిలీజ్ కు రెడీ అవుతుంది. వాస్తవానికి మాస్ జాతర(Mass Jathara) ఎప్పుడో రిలీజవాల్సింది కానీ మధ్యలో రవితేజకు యాక్సిడెంట్ అవడంతో షూటింగ్ ఆలస్యమై రిలీజ్ లేటైంది.
రిలీజ్ దగ్గర పడిన నేపథ్యంలో చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రమోషన్స్ ను స్టార్ట్ చేసింది. అందులో భాగంగానే రవితేజ ఆల్రెడీ కొన్ని ఇంటర్వ్యూలు ఇవ్వగా, ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ గురించి ఓ న్యూస్ టాలీవుడ్ లో వినిపిస్తోంది. మాస్ జాతర ప్రీ రిలీజ్ ఈవెంట్ అక్టోబర్ 28న జరగనుందని, అప్పటివరకు రవితేజ, కిషోర్ తిరుమల(Kishore Tirumala) షూటింగ్ లో బిజీగా ఉంటారని, రిలీజ్ కు రెండ్రోజుల ముందే ఈ ఈవెంట్ జరగనుందని తెలుస్తోంది. ధమాకా తర్వాత రెండోసారి ఈ సినిమాలో శ్రీలీల(Sree Leela), రవితేజకు జోడీగా నటిస్తోంది.