Vijay Devakonda: విజయ్ సినిమాకు మరాఠీ మ్యూజిక్ డైరెక్టర్లు?
జయాపజయాలతో సంబంధం లేకుండా విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) నటిస్తున్న సినిమాలకు నిర్మాతలు భారీ బడ్జెట్ లు పెట్టడానికి అసలేమాత్రం వెనుకాడటం లేదు. ప్రస్తుతం విజయ్ సితార ఎంటర్టైన్మెంట్స్(Sithara Entertainments) బ్యానర్ లో గౌతమ్ తిన్ననూరి(Gowtham thinnanuri) దర్శకత్వంలో శ్రీలంక బ్యాక్ డ్రాప్ లో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత విజయ్ రాహుల్ సాంకృత్య్సన్(Rahul Sankrityan) దర్శకత్వంలో సినిమా చేయనున్నాడు.
ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ ఇప్పటికే ఓ కొలిక్కి వచ్చినట్టు సమాచారం. క్యాస్టింగ్ తో పాటూ టెక్నికల్ టీమ్ ను సెలెక్ట్ చేసే పనిలో మేకర్స్ బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్లుగా అజయ్(Ajay)-అతుల్(Atul) లాక్ అయ్యారని సమాచారం. వీరిద్దరూ ఎక్కువగా మరాఠీలోనే వర్క్ చేసినప్పటికీ బాలీవుడ్ లో వీరి ఆల్బమ్స్ చాలానే ఉన్నాయి.
ఆదిపురుష్(Adipurush) లో 4 సాంగ్స్ వీళ్లే కంపోజ్ చేశారు. ప్రస్తుతం మరాఠీలో ఏకంగా ఏడు సినిమాలతో చాలా బిజీగా ఉన్నప్పటికీ వీరు విజయ్ సినిమా ఒప్పుకున్నారంటే ఆ సినిమా కథ వారిని ఎంతగా ఎగ్జైట్ చేసిందో అర్థం చేసుకోవచ్చు. ఈ సినిమాను రాహుల్ ఓ ల్యాండ్ మార్క్ మూవీగా మలచాలని ఎంతో గ్రౌండ్ వర్క్ చేసి మరీ స్క్రిప్ట్ రాసుకున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్(Mythri Movie Makers) ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మించనుంది.













