Mani Ratnam: వర్కింగ్ అవర్స్ పై మాట్లాడిన మణిరత్నం

కమల్ హాసన్(Kamal Hassan) హీరోగా మణిరత్నం(Mani Ratnam) దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా థగ్ లైఫ్(Thug Life). జూన్ 5న ఈ సినిమా రిలీజ్ కానుంది. యాక్షన్ థ్రిల్లర్ గా వస్తోన్న ఈ సినిమాలో శింబు(Simbhu), త్రిష(Trisha), అభిరామి(Abhirami) ప్రధాన పాత్రల్లో నటించారు. థగ్ లైఫ్ ప్రమోషన్స్ ను మేకర్స్ చాలా వేగవంతం చేయడంతో ఈ చిత్ర ప్రమోషన్స్ లో మణిరత్నం కూడా పాల్గొని పలు ఆసక్తికర విషయాలను వెల్లడిస్తున్నారు.
అందులో భాగంగానే ఆయన నటీనటులు 8 గంటలు మాత్రమే షూటింగ్ లో ఉంటామని డిమాండ్ చేయడంలో ఎలాంటి తప్పు లేదని ఆయన ఈ సందర్భంగా చెప్పారు. గత వారం రోజులుగా ఇండస్ట్రీలో వర్కింగ్ అవర్స్ మ్యాటర్ హాట్ టాపిక్ గా మారింది. బాలీవుడ్ హీరోయిన్ వర్కింగ్ అవర్స్ కారణంతోనే ఓ పెద్ద సినిమాను వదులుకున్నారని వార్తలు రాగా ఈ విషయంలో తాజాగా మణరత్నం మాట్లాడారు.
వర్కింగ్ అవర్స్ విషయంలో యాక్టర్లు చేస్తున్న డిమాండ్ కరెక్టేనని, ఇంకా చెప్పాలంటే ఇండస్ట్రీలో అలా అడిగేవాళ్లు ఉన్నందుకు సంతోషంగా ఉందని, ఒక ఫిల్మ్ మేకర్ గా తాను ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకుంటానని, అలా అడగడంలో తప్పే లేదని, అదెంతో అవసరమని, దానికి తగ్గ ప్రాధాన్యత ఉండాలని, అందరూ ఈ విషయాన్ని సరిగా అర్థం చేసుకోవాలని చెప్పారు. వర్కింగ్ అవర్స్ విషయంలో మణిరత్నం మాట్లాడిన మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.