మహేష్ నెక్ట్స్ మూవీపై సస్పెన్స్
సూపర్‌స్టార్ మహేష్ బాబు(mahesh babu) ప్రస్తుతం వారణాసి(varanasi) పనుల్లో పూర్తిగా బిజీగా ఉన్నారు. దాదాపు మూడేళ్లుగా ఈ ప్రాజెక్ట్‌పైనే దృష్టి పెట్టిన మహేష్.. తన షూటింగ్ పార్ట్‌ను అక్టోబర్‌లోపు పూర్తి చేయనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే మెయిన్ సీన్స్ షూటింగ్ పూర్తి కాగా, ఒక కీలక ఇంట్రడక్షన్ ఎపిసోడ్ మాత్రమే బ్యాలెన్స్‌లో ఉన్నట్లు సమాచారం. షూటింగ్‌తో పాటు త్వరలో డబ్బింగ్ వర్క్స్ ను కూడా పూర్తి చేయనున్నారు. ఏప్రిల్ 7న థియేటర్లలోకి రానున్న ఈ సినిమాకు రాజమౌళి ఇకపై పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ పై ఎక్కువ టైమ్ కేటాయించనున్నారు.
ఇదిలా ఉంటే వారణాసి తర్వాత మహేష్ బాబు చేయబోయే సినిమా ఏదన్నది ప్రస్తుతం ఇండస్ట్రీలో ఇంట్రెస్టింగ్ గా మారింది. మైత్రీ మూవీ మేకర్స్(mythri movie makers), దిల్ రాజు(dil raju), ఏషియన్ సునీల్(Asian suneel) వంటి ప్రముఖ నిర్మాతలు మహేష్ ను కలిసి తర్వాతి ప్రాజెక్ట్‌పై డిస్కషన్స్ జరిపినట్టు సమాచారం. డైరెక్టర్ల విషయంలో సందీప్ రెడ్డి వంగా(sandeep reddy vanga), అట్లీ(Atlee), లోకేష్ కనగరాజ్(lokesh kanagaraj) వంటి పేర్లు వినిపిస్తున్నప్పటికీ.. ఇప్పటివరకు ఏ ప్రాజెక్ట్కూ అఫీషియల్ గా గ్రీన్ సిగ్నల్ లభించలేదు.
మహేష్ వెంటనే తన నెక్స్ట్ను అనౌన్స్ చేస్తారా? లేక వారణాసి రిలీజయ్యే వరకు వెయిట్ చేస్తారా అన్నది ఇప్పుడు కీలకంగా మారింది. పైగా స్టార్ డైరెక్టర్లు ఇప్పటికే ఇతర ప్రాజెక్టులతో బిజీగా ఉండటంతో కథ, ప్రీ ప్రొడక్షన్‌కు కొన్ని నెలలు పట్టే అవకాశముంది. ప్రాజెక్ట్ ఇప్పుడే ఫిక్సైనా షూటింగ్ స్టార్ట్ అవడానికి కనీసం నాలుగైదు నెలల టైమ్ పట్టొచ్చని తెలుస్తోంది. ఇంటర్నేషనల్ లెవెల్ లో రిలీజ్ కానున్న వారణాసి రిజల్ట్ ను చూసిన తర్వాతే నెక్ట్స్ మూవీపై మహేష్ డెసిషన్ తీసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి.








