Mahesh Babu: ఫ్లైట్ సిబ్బందితో మహేష్ ఫోటో..

సూపర్ స్టార్ కనిపిస్తే సినిమాల్లో, లేదంటే ఎయిర్‌పోర్టులో కనిపిస్తూ ఉండేవారు. కానీ రాజమౌళి(rajamouli) సినిమా మొదలయ్యాక మహేష్(Mahesh) కనిపించడం చాలా తగ్గింది. అలాంటి మహేష్ రీసెంట్ గా శ్రీలంక ఎయిర్‌లైన్స్ లో కొలంబో వెళ్తూ కనిపించడంతో అందరి దృష్టి దానిపైనే పడింది. కొలంబో వెళ్తున్న మహేష్ ఫోటో ఒకటి ఇప్పుడు నెట్టంట అందరినీ ఎట్రాక్ట్ చేస్తోంది.
ఎయిర్‌లైన్ ఫ్లైట్ లోని సిబ్బందితో కలిసి మహేష్ బాబు ఫోటో దిగగా ఆ ఫోటోను స్వయంగా శ్రీలంక ఎయిర్ లైన్స్ షేర్ చేసింది. ఫోటోను షేర్ చేస్తూ సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ ను తమ ఫ్లైట్ లో కలిగి ఉండటం తమకెంతో గౌరవంగా ఉందంటూ పోస్ట్ చేసింది. ఈ ఫోటోలో మహేష్ గ్రీన్ కలర్ టీ షర్ట్, వైట్ కలర్ ప్యాంట్, కళ్లద్దాలు, క్యాప్ పెట్టుకుని చాలా స్టైలిష్ గా కనిపించారు.
ఫ్లైట్ క్యాబిన్ టీమ్ తో మహేష్ దిగిన ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది. మొత్తానికి మహేష్ రాకతో ఆ ఫ్లైట్ కూడా ఒక్కసారిగా వార్తల్లో నిలిచింది. అయితే మహేష్ శ్రీలంక వెళ్లడం వెనుక ఉన్న అసలు కారణమేంటనేది మాత్రం ఎవరికీ తెలియదు. కొందరు మహేష్ వెకేషన్ కు వెళ్లాడని అంటుంటే మరికొందరు సినిమా కోసం వెళ్లాడంటున్నారు.