ప్రేమికుల రోజున లవర్స్ డే
ప్రియా ప్రకాష్ వారియర్, రోషన్ నటించిన లవర్స్ డే చిత్రాన్ని ప్రేమికుల దినోత్సవం రోజునే విడుల చేస్తున్నారు. మలయాళం, కన్నడ, తమిళభాషల్లో ఒకేసారి విడుదలవుతోంది. తెలుగులో ఎ.గురురాజ్, సి.హెచ్.వినోద్ రెడ్డి విడుదల చేస్తున్నారు. వారు మాట్లాడుతూ లవర్స్ డేలో ఎనిమిది పాటలు ఉన్నాయి. ప్రియా వారియర్ క్రేజ్, పాటలకు వచ్చిన స్పందన సినిమాపై అంచనాలు పెంచాయి. దీనివల్ల వ్యాపారపరంగా కూడా మంచి రెప్పాన్స్ వచ్చింది. ఇప్పటికే విడుదలకు అన్ని హంగులు పూర్తిచేసుకున్నాం. ప్రేమికుల దినోత్సవం రోజున మా సినిమాను విడుదల చేస్తున్నాం అని చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: షాన్ రెహమాన్, ఛాయాగ్రహణం:శీను సిద్దార్థ్, కథ, దర్శకత్వం: ఒమర్లులు.













