గ్యాంగ్‌స్టార్‌గా బన్నీ.. లోకేష్ తో భారీ యాక్షన్ డ్రామా!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu arjun) ప్రస్తుతం డైరెక్టర్ అట్లీ(Atlee) తెరకెక్కిస్తున్న రాకా(raaka) సినిమాతో బిజీగా ఉన్నారు. భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమా 2028లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్‌ను 2027 తొలి త్రైమాసికంలోగా పూర్తి చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. మరోవైపు బన్నీ నెక్ట్స్ ప్రాజెక్టులపై కూడా ఇప్పటి నుంచే ఇంట్రెస్టింగ్ డిస్కషన్స్ జరుగుతున్నాయి. ముఖ్యంగా కోలీవుడ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్(lokesh kangaraj)తో ఆయన చేయబోతున్న సినిమా సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
ఇప్పటికే అఫీషియల్ గా అనౌన్స్ చేసిన ఈ ప్రాజెక్ట్ ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉంది. ఈ సినిమాకు గ్యాంగ్‌స్టార్ అనే వర్కింగ్ టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు సమాచారం. అయితే టైటిల్ విషయంలో మేకర్స్ నుంచి ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు. ఫుల్ లెంగ్త్ గ్యాంగ్‌స్టర్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమాలో హై ఓల్టేజ్ యాక్షన్ ఎపిసోడ్స్ మెయిన్ ఎట్రాక్షన్ గా నిలవనున్నాయని తెలుస్తోంది. అల్లు అర్జున్ ఇమేజ్‌కు అనుగుణంగా లోకేష్ కనగరాజ్ ఈ స్టోరీని రెడీ చేసినట్లు టాక్.
ఇవి కూడా చదవండి
ఇప్పటికే స్క్రిప్ట్‌ను పూర్తి చేసిన లోకేష్.. అల్లు అర్జున్ సూచనల మేరకు కొన్ని కీలక మార్పులు కూడా చేసినట్లు తెలుస్తోంది. ఈ భారీ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్(Mythri movie makers) నిర్మించనున్నారు. బడ్జెట్, కథాంశం, యాక్షన్ ఎలిమెంట్స్ పరంగా భారీ స్థాయిలో రూపొందనున్న ఈ సినిమా షూటింగ్‌ను 2027 చివరి నాటికి పూర్తి చేయాలని ప్లాన్స్ రెడీ చేస్తున్నారట. బన్నీ, లోకేష్ కనగరాజ్ కలయికలో రానున్న ఈ ప్రాజెక్ట్‌పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.







