Lokesh Kanagaraj: ఆయన వల్లే ఇండస్ట్రీలోకి వచ్చా
డైరెక్టర్ లోకేష్ కనగరాజ్(lokesh kanagaraj) క్రేజ్, టాలెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం అతను ఏం పట్టుకున్నా బంగారమే అవుతుంది. మా నగరం(maa nagaram) సినిమాతో సక్సెస్ ను అందుకున్న లోకేష్ తర్వాత కార్తీ(karthi) ఖైదీ(Khaithi) చేసి ఏకంగా విజయ్ తో సినిమాను ఓకే చేసుకున్నాడు. విజయ్(vijay) తో చేసిన మాస్టర్(master) తర్వాత తన ఫేవరెట్ హీరో కమల్ హాసన్(kamal Haasan) తో సినిమాను చేశాడు లోకేష్.
లోక నాయకుడు కమల్ హాసన్ తో చేసిన విక్రమ్(vikram) సినిమా లోకేష్ కు ఎంత పెద్ద స్టార్డమ్ ను తెచ్చిపెట్టిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ సినిమా తర్వాత మరోసారి విజయ్ తో సినిమా చేసి రీసెంట్ గా కోలీవుడ్ సూపర్ స్టార్ హీరోగా కూలీ(coolie) సినిమాను చేశాడు లోకేష్. కూలీలో రజినీకాంత్(rajinikanth) తో పాటూ పలు ఇండస్ట్రీల నుంచి స్టార్లను తీసుకుని రిలీజ్ కు ముందే సినిమాపై విపరీతమైన క్రేజ్ వచ్చేలా చేశాడు లోకేష్.
కానీ కూలీ సినిమా అనుకున్న ఫలితాన్ని అందుకోలేకపోయింది. రూ.1000 కోట్ల సినిమా అవుతుందనుకుంటే మరోసారి నిరాశే మిగిలింది. ఇదిలా ఉంటే లోకేష్ రీసెంట్ గా ఓ సందర్భంలో మాట్లాడుతూ తనకు కమల్ హాసన్ ఆదర్శమని, కమల్ కు తాను భక్తుడినని, ఆయన వల్లే తాను సినిమాల్లోకి వచ్చానని చెప్పారు. లోకేష్ చెప్పిన మాటలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.













