‘ఏ1 ఎక్స్‌ప్రెస్’లో లావణ్య లుక్ విడుదల
సందీప్ కిషన్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ఏ1 ఎక్స్‌ప్రెస్. జీవన్ దర్శకుడు. టి.జి.విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్, సందీప్ కిషన్, దయా నిర్మాతలు. లావణ త్రిపాఠి కథానాయికగా నటిస్తోంది. ఆదివారం లావణ్య పుట్టిన రోజు. ఈ సందర్భంగా సినిమాలోని లావణ్య లుక్‌ని విడుదదల ఏసింది చిత్రబృందం. ఆమె ఇందులో లావణ్యరావ్ అనే హాకీ క్రీడాకారిణిగా కనిపించనుంది. ఈ సినిమా కోసం లావణ్య హాకీ నేర్చుకుంటోంది. ఓ కోచ్‌ని కూడా నియమించుకుంది. చిన్నప్పటి నుంచీ క్రీడలంటే నాకు చాలా ఇష్టం. మా అమ్మ హాకీ ఆడేది. ఇప్పుడు ఈ సినిమాలో నేను హాకీ క్రీడాకారిణిగా కనిపించడం ఆనందంగా ఉంది అని చెప్పింది. సంగీతం: హిప్ హాప్ తమిళ.













