తెలుగు సినీ బయోపిక్ లో సినీ రాజకీయ ‘బయోపిక్’ చిత్రాలు
మహనీయుల జీవిత చరిత్రలను సినీ మాధ్యమం ద్వారా ప్రజలకి అందచేస్తే ఎప్పుడు ఆదరిస్తారని గత బయోపిక్స్ నిరూపించాయి. మన జాతి పీత ‘మహాత్మ గాంధీ’ జీవిత చరిత్ర ఆధారంగా ౧౯౮౨ లో రిచర్డ్ అట్టెంబోరౌ రూపొందించిన ‘గాంధీ’ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ఎంతగా ఆదరించారో తెలిసిందే. మన్యం వీరుడు ‘అల్లూరి సీతారామరాజు’ పాత్రలో జీవించి సూపర్ స్టార్ కృష్ణ బ్లాక్ బస్టర్ హిట్ సాధించారు. ఆ విధంగా బయోపిక్స్ కు వున్నా సక్సెస్ లు పరిశీలిస్తే ఎక్కువ శాతం విజయం సాధించిన చిత్రాలే వున్నాయి.
ఈ ఏడాది టాప్ త్రి హిట్ మూవీస్ లో సావిత్రి జీవిత చరిత్ర పై తీసిన ‘మహానటి’ చిత్రం ఎంతగా సక్సెస్ పొందిందో తెలిసిందే. తెలుగు లో కంటే హిందీ లో మరింత గా ప్రేక్షకుల ఆదరణ పొందుతున్నాయి. యం జి ఆర్ జీవిత చరిత్ర ‘ఇరువురు’గా.. మొగల్ చక్రవర్తి కథతో ‘జోదా అక్బర్’, క్రికెట్ ప్లేయర్స్ సచిన్, ధోని, అథ్లెటిక్ మిల్కా సింగ్, మేరీ కోమ్, ఒలంపిక్ 1948 లో హాకీ లో ఇండియా సాధించిన ‘గోల్డ్’ మెడల్ కథ, కుస్తీ క్రీడాకారుడు మహావీర్ సింగ్ ఫోగాట్ జీవిత కథ తో ‘దంగల్’. సిల్క్ స్మిత కథ తో ‘డర్టీ పిక్చర్’ ఇలా ఎన్నో చిత్రాలు విజయం సాధించాయి.
ఇక తాజాగా తెలుగులో ‘ఎన్.టి.ఆర్’ కథానాయకుడు, మహానాయకుడు, ‘యాత్ర’ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. ఆయన జీవితంలోని కీలకఘట్టాలతో ‘చంద్రోదయం’ పేరుతో బయోపిక్ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. పి.వెంకటరమణ దర్శకత్వంలో జి.జె.రాజేంద్ర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తెలంగాణ సీఎం కె సి ఆర్ జీవిత కథను నాజర్ పోషిస్తున్నాడు ఈ చిత్రానికి ‘ఉద్యమ సింహం’ అనే టైటిల్ పరిశీలనలో వుంది. ఝాన్సీ రాణి పాత్రలో కంగనా చేస్తున్న ‘మణికర్ణికా’, ఇంకా నటుడు రంగనాథ్ జీవిత చరిత్రతో ‘రాజువయ్యా మా రాజువయ్యా’. ఈ చిత్రాలు నిర్మాణ దశలో వున్నాయి.













