ప్రభాస్ మామగారిగా కృష్ణం రాజు? : ఆందోళనలో ప్రభాస్ ఫాన్స్
ప్రభాస్ హీరోగా బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్‌తో చేస్తోన్న ఆది పురుష్ భారతీయ ఇతిహాసం రామాయణం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోందన్న విషయం తెలిసిందే!. ఇందులో ప్రభాస్ రాముడిగా నటిస్తుంటే.. కృతి సనన్ సీత దేవి పాత్రలో కనిపిస్తోంది. దశ కంఠ రావణుడిగా బాలీవుడ్ స్టార్ సైఫ్ ఆలీఖాన్ నటిస్తున్నారు. ఎప్పుడో చిత్రీకరణను పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసుకోవటంలో బిజీగా ఉంది. ఆది పురుష్లో ప్రభాస్ మామ పాత్రలో కృష్ణంరాజు కనిపించబోతున్నారట. ప్రభాస్ – కృష్ణంరాజు కాంబినేషన్‌పై సినీ ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. బాహుబలితో పాన్ ఇండియా స్టార్‌గా మారిన కథానాయకుడు ప్రభాస్. అప్పటి నుంచి ఆయన వరుస పాన్ ఇండియా సినిమాల్లోనే నటిస్తున్నారు. ఇప్పటికే ఆయన సాహో వంటి యాక్షన్ థ్రిల్లర్.. రాధే శ్యామ్ వంటి లవ్ స్టోరీతో ప్రేక్షకులను పలకరించారు. ఇంకా మూడు ప్రాజెక్ట్స్ విడుదలకు సిద్ధమవుతున్నాయి.
ఎప్పుడో చిత్రీకరణను పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసుకోవటంలో బిజీగా ఉంది. కాగా ఈ చిత్రానికి సంబంధించి ఆసక్తికరమైన కథనం ఒకటి నెట్టింట తెగ హల్ చల్ చేస్తోంది. అయితే ఈ వార్త విన్న డార్లింగ్ ప్రభాస్ ఫ్యాన్స్‌లో మాత్రం తెలియని ఓ టెన్షన్ నెలకొందని సమాచారం. ఎందుకంటే ప్రభాస్ – కృష్ణంరాజు కలిసి నటించిన భిల్లా, రాధే శ్యామ్ చిత్రాలు డిజాస్టర్స్‌గా నిలిచాయి. మళ్లీ ఇప్పుడు వారిద్దరి కలయిక ఉంటుందంటే.. ఆ సెంటిమెంట్ తో ఆది పురుష్ ఫలితం ఎలా ఉంటుందా! అని ప్రభాస్ ఫ్యాన్స్‌కు తెలియని టెన్షన్ నెలకొందట. అసలు ఇంతకీ విషయం ఏంటంటే కృష్ణంరాజు.. ఆది పురుష్లో ఓ కీలక పాత్రధారిగా కనిపించనున్నారట. ఇంతకీ ఆ పాత్ర ఏంటో తెలుసా! జానకీ దేవి తండ్రి జనక మహారాజు. భూమి నుంచి దొరికిన సీతా దేవిని జనక మహారాజు పెంచి పెద్ద చేస్తాడు. దాంతో ఆమె జానకీ దేవిగా ప్రసిద్ధమైంది. శివుడు విల్లుని విరిచి శ్రీరాముడు ఆమెను పరిణయం ఆడిన సంగతి తెలిసిందే. అంటే ఆది పురుష్లో ప్రభాస్ మామ పాత్రలో కృష్ణంరాజు కనిపించబోతున్నారట. మరి ఈ విషయంపై చిత్ర యూనిట్ ఏమైనా రియాక్ట్ అవుతుందేమో చూడాలి.













