కైరా అద్వానీకి లక్కీ ఛాన్స్
భరత్ అనే నేను, వినయ విధేయ రామ చిత్రాలతో ప్రేక్షకుల్ని మెప్పించిన కైరా అద్వానీ ఇప్పుడు బాలీవుడ్లో అత్యంత బిజీ హీరోయిన్ అయిపోయింది. దాదాపు ఐదు సినిమాలు ఆమె ఖాతాలో ఉన్నాయి. తాజాగా కోలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్దమవుతోంది. శివకార్తికేయన్ సరసన నటించే లక్కీ ఛాన్స్‌ని దక్కించుకున్నట్టు సమాచారం. విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో ఓ సినిమాలో నటించేందుకు శివ కార్తికేయన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆయనకిది 17వ చిత్రం. లైకా ప్రొడక్షన్స్ నిర్మించబోతుంది. ఇందులో కథానాయిక కోసం కైరాతో చర్చలు జరుపుతున్నారట. ఇదే కుదిరితే కైరా కోలీవుడ్ ఎంట్రీకి లైన్ క్లీయర్ అయినట్టే అని చిత్ర వర్గాలు అంటున్నాయి.













