కియారాకు బంపర్ ఆఫర్
నా పేరు సూర్య తర్వాత తన నెక్ట్స్ సినిమాను ఫైనలైజ్ చేసేందుకు అల్లు అర్జున్ చాలా సమయం తీసుకున్నారు. అయితే చివరికి త్రివిక్రమ్ దర్శకత్వంలో తన కొత్త సినిమా చేయడానికి ఆయన ఆసక్తిగా ఉన్నారనీ, త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనుంది. ఈ సినిమాను ఎవరు నిర్మించాలనే విషయంలో కాస్త సందిగ్దత నెలకొందని ఆ విషయం తేలిన వెంటనే అల్లు అర్జున్ త్రివిక్రమ్ సినిమాను లాంచ్ చేస్తారని తెలిసింది. అయితే ఓ హిట్ హిందీ సినిమా రీమేక్‌గా ఈ చిత్రం తెరకెక్కుతుందని వార్తలు వస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీని హీరోయిన్గా ఫైనల్ చేశారట. కియారా ప్రస్తుతం రామ్‌చరణ్ బోయపాటి చిత్రంలో హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమా కాకుండా బాలీవుడ్లో అర్జున్‌రెడ్డి రీమేక్ కబీర్‌సింగ్‌లో కూడా హీరోయిన్గా చేస్తోంది. ఇక ప్రస్తుతం బన్నీతో రొమాన్స్ చేయడానికి కియారా సిద్ధమవుతోంది.













