Kiara-Siddharth Malhotra: శుభవార్త చెప్పిన బాలీవుడ్ స్టార్ కపుల్
బాలీవుడ్ స్టార్ కపుల్ కియారా అద్వానీ(Kiara Advani), సిద్ధార్థ్ మల్హోత్రా(Siddharth Malhotra) శుభ వార్త చెప్పారు. త్వరలోనే తాము ఓ బిడ్డకు జన్మనివ్వబోతున్నట్టు అనౌన్స్ చేశారు. తమ లైఫ్ కు సంబంధించిన గొప్ప గిఫ్ట్ త్వరలోనే రానుందంటూ బేబీ ఎమోజీని యాడ్ చేస్తూ ఇద్దరి చేతుల్లో బేబీ సాక్స్ను పట్టుకుని ఓ ఫోటోను పోస్ట్ చేస్తూ విషయాన్ని వెల్లడించారు.
కియారా, సిద్ధార్థ మల్హోత్రా 2023లో ఫిబ్రవరి 7న రాజస్థాన్ లో పెళ్లి చేసుకున్నారు. షేర్షా(Shersha) సినిమా నుంచి వీరిద్దరికీ పరిచయం ఏర్పడగా, ముందు అది స్నేహంగా మారి, ఆ తర్వాత ప్రేమకు దారి తీసింది. ఆపై ఇరు కుటుంబ సభ్యులను ఒప్పించి పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. రీసెంట్ గా పెళ్లి చేసుకుని రెండు సంవత్సరాలు కూడా పూర్తి చేసుకున్నారు.
ఈ విషయం తెలుసుకున్న సెల్రబిటీలు, ఫ్యాన్స్ కియారా, సిద్ధార్థ్ కు విషెస్ తెలుపుతూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్ అవుతుంది. ఇదిలా ఉంటే కియారా రీసెంట్ గా గేమ్ ఛేంజర్(Game Changer) సినిమాతో ఆడియన్స్ ముందుకు రాగా, ప్రస్తుతం అమ్మడి చేతిలో యశ్(Yash) టాక్సిక్(Toxic) తో పాటూ వార్2(War2) కూడా ఉంది.













