Keerthy Suresh: ప్రముఖ డైరెక్టర్ తో స్క్రీన్ షేర్ చేసుకోనున్న కీర్తి

సౌత్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్(keerthy suresh) కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే తన బాయ్‌ఫ్రెండ్ ఆంటోనీ(anthony)ని పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టింది. పెళ్లి చేసుకున్న తర్వాత కెరీర్ లో కాస్త బ్రేక్ తీసుకున్న కీర్తి ఇప్పటివరకు మరో సినిమాను చేసింది లేదు. ఆఖరికి ఇన్నాళ్ల గ్యాప్ కు బ్రేక్ వేస్తూ కీర్తి ఓ కొత్త తమిళ సినిమాకు సైన్ చేసింది.
అయితే ఇన్ని రోజులు కీర్తి కావాలని బ్రేక్ తీసుకుందా లేక సరైన కథలు లేక బ్రేక్ తీసుకోవాల్సి వచ్చిందో తెలియదు కానీ ఇప్పుడు తాజాగా అమ్మడు ఓ తమిళ డైరెక్టర్ కు ఓకే చెప్పినట్టు సమాచారం. ఈ సినిమా కోసం సెన్సేషనల్ డైరెక్టర్, యాక్టర్ మిస్కిన్ తో కలిసి కీర్తి సురేష్ స్క్రీన్ ను షేర్ చేసుకోనుందట. ఈ మూవీకి కథ కూడా మిస్కిన్(Mysskin) అందించారు.
డిటెక్టివ్(detective), పిశాచి(pisachi) లాంటి ఎన్నో సూపర్ హిట్లు తీసిన డైరెక్టర్ మిస్కిన్ ఈ సినిమాలో కీర్తి తో కలిసి నటించనున్నారు. ఈ సినిమా కోర్ట్ రూమ్ డ్రామాగా తెరకెక్కనుండగా, ఈ మూవీకి ప్రవీణ్ విజయ్(praveen vijay) దర్శకత్వం వహించనున్నారు. డ్రమ్‌స్టిక్ ప్రొడక్షన్(drumstick productions), జీ స్టూడియోస్(zee studios) బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా పూర్తవగా ఈ సినిమా కోసం తానెంతో వెయిట్ చేస్తున్నట్టు కీర్తి రాసుకొచ్చారు.