విశ్వంభర కోసం కీరవాణి స్పెషల్ కేర్
ఒక సినిమా హిట్టవ్వాలంటే అన్నీ సమపాళ్లలో కుదిరితేనే అది వర్కవుట్ అవుతుంది. ఈ నేపథ్యంలో కథ, కథనంతో పాటూ ఒక సినిమాకు మ్యూజిక్ కూడా ఎంతో ముఖ్యమైనదనే విషయం అందరికీ తెలిసిందే. కొన్ని సినిమాలు కేవలం మ్యూజిక్ వల్లే హిట్టయిన సందర్భాలుంటే, మరికొన్ని అదే మ్యూజిక్ బాగోలేక ఫ్లాపులుగా కూడా మిగిలిపోయాయి.
ఇక అసలు విషయానికొస్తే ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర సినిమాకు సంగీతం ప్రాధాన్యత చాలా ఉంటుందని తెలుస్తోంది. యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఆస్కార్ విజేత కీరవాణి సంగీతం అందిస్తున్నాడు. వశిష్ట మొదటి సినిమా బింబిసారకు కూడా కీరవాణి వర్క్ చేశారు.
ఇప్పుడు మరోసారి కీరవాణి, వశిష్ఠ కలిసి విశ్వంభర కోసం పని చేస్తున్నారు. ఈ సినిమాకు కీరవాణి నెక్ట్స్ లెవెల్ మ్యూజిక్ అందిస్తున్నారని తెలుస్తోంది. విశ్వంభర కోసం కీరవాణి ఎంతో స్పెషల్ కేర్ తీసుకుంటున్నట్లు సమాచారం. ఎక్కువ భాగం సీజీ వర్క్ తో తెరకెక్కుతన్న విశ్వంభరకు దానికి తగ్గ సంగీతం అందించనున్నాడట కీరవాణి. దాంతో పాటై మెగాస్టార్ కోసం డ్యాన్స్ మూమెంట్స్ కూడా ఉండే బీట్స్ ను కీరవాణి రెడీ చేస్తున్నాడట. దీన్ని బట్టి చూస్తుంటే విశ్వంభర హైలైట్స్ లో మ్యూజిక్ కూడా ఒకటిగా నిలవనుందని అర్థమవుతుంది. మరి విశ్వంభరతో కీరవాణి ఎన్ని సంచలనాలు సృష్టిస్తాడో చూడాలి.













