కీరవాణి రేంజ్ వేరులే
ఏ మ్యూజిక్ డైరెక్టర్ అయినా సరే కొంత కాలం పాటూ స్టార్ స్టేటస్ చూశాక నెమ్మదిగా ఛాన్సులు తగ్గడం కామన్. కానీ ఎంఎం కీరవాణికి మాత్రం ఈ విషయంలో మినహాయింపు వర్తిస్తుంది. ఆయనతో పాటూ సమకాలీనులైన ఏఆర్ రెహమాన్, ఇళయరాజా ఇంకా పోటీలోనే ఉన్నప్పటికీ, పలు ఆఫర్లతో బిజీ అయినప్పటికీ కీరవాణిలా ఈ వయసులో కూడా ఆస్కార్ వచ్చే సాంగ్స్ ఇవ్వడం లేదనేది మాత్రం వాస్తవం.
ఆరు పదుల వయసులో కూడా కీరవాణి వరుస ఆఫర్లతో ఇండస్ట్రీని దున్నేస్తున్నారు. ఎంతో ప్రతిష్టాత్మకమైన మూడు పాన్ ఇండియా సినిమాలకు కీరవాణి పని చేస్తున్నారు. చిరంజీవి హీరోగా వస్తున్న విశ్వంభర సినిమాకు కీరవాణినే సంగీతం అందిస్తున్నాడు. ఆపద్భాంధవుడు, ఘరానా మొగుడు సినిమాలను మించిన సంగీతం కీరవాణి ఈ సినిమాకు ఇస్తాడని మెగా ఫ్యాన్స్ ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు.
మరోవైపు పవన్ కళ్యాణ్ తో కలిసి కీరవాణి మొదటిసారి హరిహర వీరమల్లు అనే సినిమాకు వర్క్ చేస్తున్నారు. ఇవన్నీ ఒకెత్తయితే యావత్ ప్రపంచం ఎదురుచూస్తున్న రాజమౌళి- మహేష్ సినిమాకు కూడా కీరవాణినే సంగీతం అందించనున్నాడు. సింగర్ గా, లిరిక్ రైటర్ గా తనదైన ముద్ర వేసిన కీరవాణి ఇప్పటి యంగ మ్యూజిక్ డైరెక్టర్లతో కూడా పోటీ పడుతూ తన సత్తాని చాటుతుండటం విశేషం.













