తెలుగులో కయాదు తిప్పలు!
కయాదు లోహర్(kayadhu lohar)కి టాలీవుడ్లో వరుస అవకాశాలొస్తున్నా.. వాటిని సక్సెస్‌లుగా మలుచుకోవడంలో మాత్రం ఇంకా ఎదురుచూపులే కనిపిస్తున్నాయి. అల్లూరి(Alluri) తో తెలుగు తెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ.. తర్వాత తమిళ, మలయాళ సినిమాలతో తనకంటూ గుర్తింపు తెచ్చుకుంది. దీంతో తెలుగులోనూ అవకాశాలు పెరిగాయి. విశ్వక్సేన్(viswaksen)తో చేసిన ఫంకీ(Funky) ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోయినా.. కయాదుపై దర్శకనిర్మాతల నమ్మకం తగ్గలేదు. తాజాగా ది ప్యారడైజ్(the paradise) లో మరో కీలక అవకాశం దక్కింది.
అయితే ది ప్యారడైజ్ కయాదు కెరీర్‌కు ఆశించిన మైలేజ్ ఇవ్వలేకపోయింది. సినిమాలో ఆమె క్యారెక్టర్ ను తీర్చిదిద్దిన విధానం, స్క్రీన్ ప్రెజెన్స్ ఆడియన్స్ కు అంతగా కనెక్ట్ కాలేదు. కథతో పాత్రకు ఉన్న అనుసంధానం కూడా బలంగా కనిపించకపోవడంతో.. కయాదు చేసిన ప్రయత్నం పెద్దగా ఫలించలేదు. దీంతో తెలుగులో వరుసగా ఎదురైన ఫలితాలు ఆమె కెరీర్‌పై చర్చకు దారితీశాయి.
అయితే కయాదు కెరీర్‌కు ఇప్పుడే బ్రేక్ పడినట్లు భావించాల్సిన అవసరం లేదు. సరైన కథ, తన ఇమేజ్‌కు తగ్గ పాత్ర దొరికితే యంగ్ హీరోల సరసన ఆమెకు మంచి స్పేస్ ఉంటుంది. ముఖ్యంగా లవ్ స్టోరీలు, ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ ఆమెకు ఉపయోగపడే అవకాశముంది. ప్రస్తుతం తమిళ, మలయాళ సినిమాల్లోనూ అవకాశాలు కొనసాగుతుండటంతో.. టాలీవుడ్లో సరైన ఛాన్స్ కోసం కయాదు జర్నీ కొనసాగుతూనే ఉంది.








