గేమ్ చేంజర్ కథ గురించి కార్తీక్ సుబ్బరాజ్ ఏమన్నాడంటే
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్లో వస్తున్న గేమ్ చేంజర్ సినిమాపై అందరికీ మంచి అంచనాలున్నాయి. ఈ సినిమా షూటింగ్ అనుకున్నట్లు జరగకపోతున్నప్పటికీ, గేమ్ చేంజర్ పై హైప్ మాత్రం అంతే ఉంది. గేమ్ చేంజర్ కథ డైరెక్టర్ శంకర్ సొంత కథ కాదు. తమిళ స్టార్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ ఈ సినిమాకు కథ అందిస్తున్న విషయం తెలిసిందే.
వెరైటీ ఐడియాలతో కథలు అల్లే కార్తీక్, శంకర్ సినిమాకు కథ అందించడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. గేమ్ చేంజర్ కు ఏ సిట్యుయేషన్స్ లో కథను ఇవ్వాల్సి వచ్చిందో కార్తీక్ రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు. తన కెరీర్లో ఎప్పుడూ లేని విధంగా మంచి పొలిటికల్ కథ రాసిన కార్తీక్, అది మంచి షేప్ తీసుకున్నాక తన అసిస్టెంట్లకు చెప్తే, కథ శంకర్ సినిమాలాగా పెద్ద స్థాయిలో కనిపిస్తోందన్నారట.
అంత పెద్ద స్థాయి పొలిటికల్ మూవీ తీసే రేంజ్ కు తానింకా రాలేదని, అందుకే ఆ కథను శంకర్ కు ఇవ్వాలనిపించి, ఇచ్చేసినట్లు కార్తీక్ తెలిపాడు. అయితే గేమ్ చేంజర్ కు తాను కథ మాత్రమే ఇచ్చానని, స్క్రీన్ ప్లే మొత్తం శంకరే రెడీ చేసుకున్నాడని, ఈ సినిమా తెరపై ఎలా రూపొందుతుందో చూడ్డానికి తాను చాలా ఎగ్జయింట్ గా ఉన్నట్లు కార్తీక్ తెలిపాడు.













