భారతీయుడు 2 కి లైన్ క్లియర్
అగ్ర నటుడు కమల్‌హాసన్ ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. ఇకపై ఆయన సినిమాల మీద అంతగా దృష్టి పెట్టకపోవచ్చని సిని వర్గాల్లో వినిపించింది. అయితే అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తూ ప్రస్తుతం రెండు సినిమాల్ని పట్టాలెక్కించారు కమల్‌హాసన్. ఆయన కథానాయకుడిగా శంకర్ దర్వకత్వంలో రూపొందుతున్న భారతీయుడు -2 చిత్రం ఆర్థిక కారణాల వల్ల మధ్యలో ఆగిపోయిందనే వార్తలొచ్చాయి. సినిమా తిరిగి ఎప్పుడు ప్రారంభం అవుతుందనే విషయంలో ఎవరి దగ్గర సృష్టత లేకుండా పోయింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఆగస్ట్ 19 నుంచి ఈ సినిమా చిత్రీకరణను తిరిగి మొదలుపెట్టేందుకు చిత్ర బృందం నిర్ణయించిందని తెలిసింది. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ ప్రధాన నాయికగా నటిస్తున్నది. ఆమెతో పాటు ప్రియాభవానిశంకర్, ఐశ్వర్య రాజేష్‌లను కథానాయికలుగా తీసుకోబోతున్నారు. ఈ విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.













