ఎన్టీయార్ తో కెజిఎఫ్ దర్శకుడి చిత్రం?
ఇప్పుడున్న టాలీవుడ్ టాప్ హీరోస్లో ఎన్టీయార్ ఇమేజ్ ప్రత్యేకమైందని వేరే చెప్పక్కర్లేదు. ముఖ్యంగా యాక్షన్ ఓరియెంటెడ్, యాంగ్రీ యంగ్ మేన్ పాత్రల్లో, డైలాగ్ డెలివరీలో ఎన్టీయార్ తనకు తానే సాటి. లవకుశ, టెంపర్ వంటి చిత్రాల ద్వారా తన నటనలోని వైవిధ్యాన్ని ప్రేక్షకులకు పరిచయం చేసిన ఎన్టీయార్…లాంటి హీరో ఓ దర్శకుడితో గత కొంత కాలంగా సినిమా చేయాలనుకుంటున్నాడట. అదెవరో తెలుసా? కెజిఎఫ్ లాంటి సూపర్ హిట్ అందించిన ప్రశాంత్ నీల్. ఆ సినిమాలో హీరో యష్‌ని ఓ రేంజ్లో చూపించిన ప్రశాంత్ నీల్‌కు సైతం ఎన్టీయార్‌తో సినిమా చేయాలని ఆశిస్తున్నాడు. అయితే వీరిద్దరి జోడీ పట్టాలెక్కడానికి ముహూర్తమే కుదరడం లేదు. గత కొంత కాలంగా ఇద్దరి మధ్యా చర్చలు నడుస్తున్నప్పటికీ…ఏదో ఒక అవాంతరం వస్తోందని సమాచారం.
ఈ నేపధ్యంలో తన 30వ సినిమాను ప్రశాంత్ నీల్‌కే అప్పగిద్దామనకున్నాడట ఎన్టీయార్. అయితే అదే సమయంలో కెజిఎఫ్ 2 పనులతో ప్రశాంత్ నీల్ తలమునకలుగా ఉండడంతో దర్శకుడు త్రివిక్రమ్ సినిమాయే 30వ సినిమాగా మారింది. ఏదేమైనా… ప్రశాంత్ నీల్, ఎన్టీయార్ కాంబినేషన్లో సినిమా తధ్యం అని, అన్నీ కుదిరితే ఆర్ఆర్ఆర్, త్రివిక్రమ్ సినిమాల తర్వాత సినిమా వీరి జోడీదే కావచ్చునని టాలీవుడ్ టాక్.













