తారక్ కుమారుడి పేరేంటో తెలుసా?
యంగ్ టైగర్ ఎన్టీఆర్, ప్రణతి దంపతులకు ఇటీవల పండంటి మగ బిడ్డ పుట్టిన సంగతి తెలిసిందే. అయితే ఈరోజు నామకరణ కార్యక్రమాన్ని నిర్వహించారట. చిట్టి టైగర్‌కు భార్గవ్ రామ్ అని పేరు పెట్టినట్లు తారక్ ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు. తారక్ తన ఇద్దరు కుమారులు, ప్రణతితో కలిసి దిగిన ఫొటోను షేర్ చేశారు. ఈ చిన్నోడి పేరు భార్గవ్ రామ్ అని పేర్కొంటూ నామకరణ మహోత్సవం, ఫ్యామిలీ టైమ్ అన్న హ్యాష్‌ట్యాగ్స్ ఇచ్చారు. తారక్, అభయ్, ప్రణతి బుల్లి భార్గవ్‌ని ఆప్వాయంగా చూస్తున్న ఈ ఫొటో నెటిజన్లను ఆకట్టుకుంటోంది.













