నటుడిగా కాదు… బాధితుడిగా వచ్చాను
యంగ్ టైగర్ ఎన్టీఆర్ సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ కేంద్రానికి వచ్చారు. సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ వార్షిక సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన స్టాళ్లను ఆసక్తిగా పరిశీలించారు. వారు వినియోగించే రక్షణాత్మక పరికరాల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం సమావేశంలో ఎన్టీఆర్ మాట్లాడుతూ నేను ఈ సమావేశానికి ఒక నటుడిగానే రాలేదు. ఒక పౌరునిగా, రోడ్డు ప్రమాదంలో ఇద్దరు కుటుంబసభ్యులను కోల్పోయిన బాధితుడిగా వచ్చాను. ట్రాఫిక్స్ రూల్స్, రోడ్డు జాగ్రత సూచనలు పాటించడం సర్వోత్తమమైన విషయం అని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో సీపీ సజ్జనార్‌తో పాటు ఇతర పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.













