ఉత్సాహంగా వేగా జ్యువెలర్స్ ‘రాగ దండియా ఉత్సవ్ 2.0
*కాకినాడలో దేవీ శరన్నవరాత్రి వేళ వెల్లివిరిసిన సరికొత్త సాంస్కృతిక శోభ*
*వేగా జ్యువెలర్స్ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా ‘రాగ దండియా ఉత్సవ్ 2.0*
*ద్వారంపూడి ఫంక్షన్ హాల్లో సాంప్రదాయం, ఆధునిక వినోదాల కలయికతో సాగిన వేడుక*
*కాకినాడ చారిత్రక సంస్కృతిని ప్రతిబింబిస్తూ ఘనంగా జరిగిన దాండియా, గర్బా నృత్యాలు*
*బిగ్ బాస్ ఫేమ్ ఉదయ్ మాస్టర్ బృందం ప్రత్యేక నృత్య ప్రదర్శనలతో దద్దరిల్లిన స్టేజ్*
*డీజే పాటలు దండియా ఆటల, పంజాబీ ధోల్ వాయిద్యాలతో మార్మోగిన కాకినాడ*
*అతిథులకు సాంప్రదాయ హారతి, తిలకంతో ఘన స్వాగతం పలికిన నిర్వాహకులు*
*కాకినాడ నగర సంస్కృతీ సంప్రదాయాలను చాటిచెప్పిన వేగా జ్యువెలర్స్*
‘*రాగ దండియా ఉత్సవ్ 2.0’*
*పండుగలు సమాజంలో బంధాలను బలపరుస్తాయన్న వేగా జ్యువెలర్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సుధాకర్ వనమా*
*కాకినాడ ప్రజల కోసం ఒక మరపురాని పండుగ అనుభూతిని అందించామన్న ఎండి నవీన్ వనమా*
*కార్యక్రమంలో భారీ సంఖ్యలో పాల్గొని దండియా నృత్యాలతో సందడి చేసిన నగర మహిళలు, యువత*
——————————
కాకినాడ సంస్కృతీ సంప్రదాయాలతో సరికొత్త ఆవిష్కరణ
సంప్రదాయ కళలు, సంస్కృతి, సాహిత్యానికి పురిటిగడ్డ అయిన కాకినాడ నగరంలో శరన్నవరాత్రి వేడుకలు సరికొత్త శోభను సంతరించుకున్నాయి. ప్రముఖ లగ్జరీ ఆభరణాల సంస్థ ‘వేగా జ్యువెలర్స్’ ఆధ్వర్యంలో నాగమల్లి తోట జంక్షన్ సమీపంలోని ద్వారంపూడి ఫంక్షన్ హాల్లో నిర్వహించిన ‘రాగ దండియా ఉత్సవ్ 2.0’ సంప్రదాయాలకు, ఆధునిక వినోదానికి వేదికగా నిలిచింది. కాకినాడ చారిత్రక సాంస్కృతిక మూలాలను గౌరవిస్తూ, పశ్చిమ భారత దండియా, గర్బా నృత్య రీతులను మేళవించి నిర్వహించిన ఈ ఈవెంట్లో నగర వాసులు, యువతీ యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని సందడి చేశారు.
వెల్లివిరిసిన సాంస్కృతిక సమ్మేళనం
కళలకు కాణాచిగా పేరుగాంచిన కాకినాడ నగర సంప్రదాయానికి తగ్గట్టుగా విచ్చేసిన అతిథులకు పూర్ణకుంభంతో సాంప్రదాయ హారతి, తిలకంతో ఘన స్వాగతం పలికారు. బిగ్ బాస్ ఫేమ్ ఉదయ్ మాస్టర్ వారి బృందం ప్రదర్శించిన ప్రత్యేక సాంస్కృతిక నృత్య రూపకాలు కాకినాడ కళాభిమానులను మంత్రముగ్ధులను చేశాయి. ఒకవైపు స్థానిక పండుగ వాతావరణం ఉట్టిపడుతుండగా, మరోవైపు రెండు ప్రత్యేక డీజేల ఆధునిక సంగీతం, సాంప్రదాయ పంజాబీ ధోల్ వాయిద్యాల హోరు నగరానికి సరికొత్త జోష్‌ను పెంచాయి. వేదిక వద్ద ఏర్పాటు చేసిన సంప్రదాయ పోటీలు, రంగురంగుల గాజుల దుకాణాలు, ముఖచిత్రం (ఫేస్ పెయింటింగ్), సెల్ఫీ పాయింట్లు నగర సంస్కృతిని ప్రతిబింబింపజేశాయి. అలాగే కాకినాడ ప్రత్యేక రుచులతో కూడిన ఫుడ్ స్టాల్స్, మాక్‌టైల్ కౌంటర్లు సందర్శకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.
స్థానిక కళలకు ప్రాధాన్యత
ఈ సందర్భంగా వేగా జ్యువెలర్స్ మేనేజింగ్ డైరెక్టర్ నవీన్ వనమా మాట్లాడుతూ…వేగా జ్యూయలర్స్ కాకినాడలో ఇంత పెద్ద కార్యక్రమం చేయటం మొదటిసారి…
“సంస్కృతికి నిలయమైన కాకినాడ నగరంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలను స్థానిక సంప్రదాయాల కలయికతో నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. భక్తి, సాంప్రదాయం, ఐక్యతను పెంపొందించేందుకు ఈ వేడుక ఒక చక్కని మార్గంగా నిలిచిందని పేర్కొన్నారు. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సుధాకర్ వనమా మాట్లాడుతూ.. కాకినాడ ప్రజలు, ముఖ్యంగా మహిళలు, యువత చూపిన ఉత్సాహం నగర కళాభిమానానికి నిదర్శనమని కొనియాడారు. 1989 నుండి భారతీయ హస్తకళల వారసత్వాన్ని, స్వచ్ఛతను కాపాడుతూ వస్తున్న వేగా జ్యువెలర్స్, కాకినాడ నగర సంస్కృతిని మరింత ఉన్నతంగా చాటిచెప్పేందుకు ఈ ఉత్సవాన్ని ఒక వేదికగా మలచిందని యాజమాన్యం స్పష్టం చేసింది.











