Trisha: అవన్నీ విని అసహ్యం వేస్తుంది
సోషల్ మీడియా వాడకం పెరిగిన తర్వాత ఏది నిజం, ఏది అబద్ధం అనేది మినిమం తెలుసుకోకుండా ఎవరికి నచ్చింది వారు అనేస్తూ ఎన్నో పుకార్లను పుట్టిస్తున్నారు. ఏదైనా విషయాన్ని ఒకరు చెప్పడం ఆలస్యం, అందులో నిజమెంతన్నది కనీసం ఆలోచించకుండా వాటిని వైరల్ చేస్తూ రూమర్లు క్రియేట్ చేస్తున్నారు. అందులో భాగంగానే సీనియర్ హీరోయిన్ త్రిష(Trisha) పెళ్లి గురించి కూడా ఇప్పటికే ఎన్నో వార్తలొచ్చాయి.
త్రిష ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఎంతోమంది స్టార్ల సరసన నటించి ఆడియన్స్ ను ఆకట్టుకుని చాలా మంది ఫ్యాన్స్ ను సంపాదించుకుంది. పొన్నియన్ సెల్వన్(ponniyan selvan) సినిమాల తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ ను స్టార్ట్ చేసిన త్రిష ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి(chiranjeevi) సరసన విశ్వంభర(viswambhara) చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే గత కొన్నాళ్లుగా త్రిష, దళపతి విజయ్(thalapathy vijay) తో రిలేషన్ లో ఉందని వార్తలొస్తున్నాయి.
ఆ వార్తలకు ఆజ్యం పోస్తున్నట్టు విజయ్ బర్త్ డే రోజున త్రిష కుక్కపిల్లను ఎత్తుకుని విజయ్ ఆడిస్తూ కనిపించడం, విజయ్ పక్కనే త్రిష నవ్వుతూ కూర్చోగా, ఆ ఫోటోను చూసి వారిద్దరి మధ్య ఏదో జరుగుతుందని భారీ ప్రచారమే జరిగింది. అయితే తాజాగా త్రిష ఈ రూమర్లపై రియాక్ట్ అయినట్టు తెలుస్తోంది. సినీ ఇండస్ట్రీలో తనకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారని, వారందరితో తనకు పెళ్లి అని రాస్తున్నారని, అవన్నీ విని తనకు అసహ్యమేస్తుందని, ఇలాంటి ఫేక్ వార్తలను వైరల్ చేయొద్దని త్రిష చెప్పినట్టు తెలుస్తోంది.






