‘ఇట్లు మీ శ్రీమతి’ ప్రారంభం
హంస వాహిని టాకీస్ పతాకంపై ఎమ్.ఎస్.రెడ్డి నిర్మాణంలో మురళి బోడపాటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ఇట్లు మీ శ్రీమతి. వినోదభరితమైన కథాంశంతో రూపొందుతున్న ఈ సినిమా పూజా కార్యక్రమాలతో లాంఛనంగా మొదలైంది. ప్రముఖ దర్శకుడు వి.సాగర్ గౌరవ దర్శకత్వం వహించగా ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెకరిట్రీ టి.ప్రసన్న కుమార్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ప్రముఖ నిర్మాత దామోదర్ ప్రసాద్ మొదటి సన్నివేశానికి క్లాప్ కొట్టారు. రెగ్యులర్ షూటింగ్ అక్టోబర్ నుండి ప్రారంభం కానుంది. వెంగీ సంగీతం అందిస్నుత్న ఈ సినిమాకు తోట.వి.రమణ కెమెరామోన్గా పని చేస్తున్నారు. ప్రముఖ ఎడిటర్ మార్తాండ్ కె వెంకటేష్ ఈ సినిమా ఎడిటర్. ఈ చిత్రంలో నటించే ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల ఎంపిక జరుగుతోంది. త్వరలో ఆ వివరాలు చిత్ర యూనిట్ ప్రకటిస్తారు.













