ముంబైలో కాస్ట్ లీ ఇల్లు కొన్న సూర్య. రేటు ఎంతంటే?
తమిళ నటుడు సూర్య కమర్షియల్ ఫిల్మ్స్ తో పాటుగా ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్స్ చేయడంలో కూడా ముందుంటాడు. ఓ పక్క హీరోగా సినిమాలు చేస్తూనే మరోవైపు 2డీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో సినిమాలు నిర్మిస్తుంటాడు. సూర్య చేసిన సినిమాలను బాలీవుడ్లో రీమేక్ చేయాలని ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడట సూర్య. దీని కోసం రెగ్యులర్‌గా చెన్నై నుంచి ముంబై కూడా వెళ్లొస్తున్నాడు.
చెన్నైలో ఎలాగూ మంచి విల్లా ఉన్న సూర్య, ముంబైలో కూడా సొంత ఇల్లు కొన్నట్లు తెలుస్తుంది. ముంబై లో ఉండే సెలబ్రిటీలు, పొలిటీషియన్స్ ఉండే రిచ్ ఏరియాలో 9000 చ.అల ఫ్లాట్‌ను కొన్నారట సూర్య. దీని రేటు అక్షరాలా 70 కోట్లు. అయితే సూర్య అంత ఖర్చు పెట్టి, ముంబైలో ఇల్లు కొనడానికి ఏంటి రీజన్ అనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
ప్రస్తుతం సూర్య తన 41వ సినిమాను శివ డైరెక్షన్లో చేస్తున్నాడు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై సూర్య చాలా ధీమాగా ఉన్నాడు. ఈ మూవీని పాన్ ఇండియన్ లెవల్లో రిలీజ్ చేయాలని సూర్య ప్లాన్ చేస్తున్నాడట. రీసెంట్ టైమ్ లో సూర్య నటిస్తున్న కమర్షియల్ ఫిల్మ్ ఇదే అనుకోవచ్చు.
ఇకపోతే సూర్య తమిళ హీరోనే అయినా ఆయనకు టాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉంది. గజిని నుంచి ప్రతి సూర్య సినిమాకు తెలుగులో మంచి బిజినెసే అవుతుంది. సూర్య నటించిన ఆకాశమే హద్దురా, జై భీం సినిమాలు తెలుగులో కూడా మంచి హిట్లుగా నిలిచాయి.













