Harish Shankar: ఆ బ్యానర్ లో హరీష్ సినిమా?
సినీ ఇండస్ట్రీలో కొన్నిసార్లు ఎవరూ ఊహించని కాంబినేషన్లు జరుగుతూ ఉంటాయి. కొన్ని కాంబినేషన్లు కుదురుతాయని ఎవరూ అనుకోరు. అలాంటి ఓ కాంబినేషనే డైరెక్టర్ హరీష్ శంకర్(harish Sankar), సితార ఎంటర్టైన్మెంట్స్(sithara entertainments). నిర్మాత నాగ వంశీ(naga vamsi)కి, హరీష్ శంకర్ కు మొదటి నుంచి కూడా మంచి బాండింగ్ లేదు. దానికి తోడు రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో నాగవంశీ మిస్టర్ బచ్చన్ (mr. bachan)పై చేసిన కామెంట్స్ వల్ల హరీష్ హర్ట్ అయ్యాడని కూడా అన్నారు.
అలాంటి వారిద్దరి కలయికలో ఓ సినిమా రాబోతుందని తెలుస్తోంది. గత కొన్నాళ్లుగా త్రివిక్రమ్(trivikram), హరీష్ శంకర్ మధ్య మంచి అనుబంధం ఏర్పడిందని అందులో భాగంగానే హరీష్ సితారలో ఓ సినిమా చేయబోతున్నారని తెలుస్తోంది. సితార బ్యానర్ తో కలిసి త్రివిక్రమ్ భార్య సౌజన్య(sowjanya) ఫార్చూన్ ఫోర్ సినిమాస్(Fortune four cinemas) బ్యానర్ లో సినిమాలు నిర్మిస్తోన్న సంగతి తెలిసిందే.
అందులో భాగంగానే సితారతో హరీష్ ఓ సినిమా చేస్తున్నాడని, ఉస్తాద్ భగత్ సింగ్(Ustaad bhagath singh) తర్వాత హరీష్ చేయబోయే సినిమా ఇదేనని అంటున్నారు. ఈ సినిమాలో టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ(vijay devarakonda) హీరోగా నటించనున్నాడని అంటున్నాడు. రీసెంట్ గా సితార బ్యానర్ లో కింగ్డమ్(kingdom) చేసిన విజయ్, మరో సినిమాను ఆ బ్యానర్ లో ఒప్పుకున్నాడని ఆ సినిమాకు హరీష్ శంకర్ డైరెక్టర్ అని వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో నిజమెంతనేది తెలియాల్సి ఉంది.







