Telugu Times
Telugu Times Youtube Channel
English
  • English
  • తెలుగు
  • telugutimes
  • USA తెలుగు వార్తలు
    • బే ఏరియా
    • డల్లాస్
    • న్యూజెర్సీ
    • న్యూయార్క్
    • వాషింగ్టన్ డి.సి
  • పాలిటిక్స్
    • నవ్యాంధ్ర
    • తెలంగాణ
    • నేషనల్
    • ఇంటర్నేషనల్
    • పొలిటికల్ ఆర్టికల్స్
    • USA పాలిటిక్స్
  • సినిమా
    • సినిమా న్యూస్
    • USA సినిమా న్యూస్
    • సినిమా రివ్యూస్
    • సినిమా ఇంటర్వ్యూస్
    • ట్రైలర్స్
  • టాపిక్స్
  • ఇతర వార్తలు
    • రియల్ ఎస్టేట్
    • బిజినెస్ న్యూస్
    • రిలీజియస్
    • షాపింగ్
epaper E-PAPER
YouTube Logo
Subscribe
  • USA తెలుగు వార్తలు
  • పాలిటిక్స్
  • సినిమా
  • టాపిక్స్
  • epaper E-PAPER
  • YouTube Logo
    Subscribe
  • USA తెలుగు వార్తలు
    • Bay Area
    • Dallas
    • New Jersey
    • New York
    • Washington DC
  • పాలిటిక్స్
    • నవ్యాంధ్ర
    • తెలంగాణ
  • సినిమా
    • సినిమా న్యూస్
    • సినిమా న్యూస్ ఇన్ USA
    • సినిమా రివ్యూ
    • సినిమా ఇంటర్వ్యూ
    • ట్రైలర్స్
  • టాపిక్స్
  • ఇతర వార్తలు
    • రియల్ ఎస్టేట్
    • రిలీజియస్
    • షాపింగ్
  • E-PAPER
  • YouTube Subscribe
  • Home » Cinema » Cinema News » Hari hara veera mallu a step back for bigger strides ahead official statement on release date

HHVM: హరి హర వీర మల్లు – కాస్త ఆలస్యం, చరిత్ర సృష్టించడానికి సిద్ధం – విడుదల తేదీపై అధికారిక ప్రకటన

  • Published By: techteam
  • June 6, 2025 / 06:20 PM IST
  • Facebook
  • twitter
  • whatsapp
Hari Hara Veera Mallu A Step Back For Bigger Strides Ahead Official Statement On Release Date

ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాలలో ‘హరి హర వీర మల్లు’ (Hari Hara Veera Mallu ) ఒకటి. ఈ చిత్ర విడుదల గురించి జరుగుతున్న ప్రచారాలు, పెరుగుతున్న ఊహాగానాలు నేపథ్యంలో నిర్మాతలు అధికారిక ప్రకటన విడుదల చేశారు.

Telugu Times Custom Ads

“అచంచలమైన ఓపిక మరియు నమ్మకంతో ‘హరి హర వీరమల్లు’ సినిమాకు తోడుగా నిలిచిన అభిమానులు, శ్రేయోభిలాషులు మరియు సినీ ప్రేమికులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు.

గతంలో ప్రకటించిన జూన్ 12వ తేదీకి చిత్రాన్ని మీ ముందుకు తీసుకురావడానికి అవిశ్రాంత ప్రయత్నాలు చేస్తున్నాము. అయినప్పటికీ ఆ తేదీకి చిత్రాన్ని థియేటర్లలోకి తీసుకురాలేకపోతున్నామని తెలియజేస్తున్నాము.

కష్టమైనయినప్పటికీ తప్పనిసరి పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) గారి యొక్క ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని మరింత గొప్పగా మలచాలనేదే మా ప్రయత్నం. ప్రతి ఫ్రేమ్ పై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ, అద్భుతమైన చిత్రంగా మలిచే ప్రయత్నంలో నిమగ్నమై ఉన్నాము. అందుకే మేము మరి కొంత సమయం తీసుకుంటున్నాము. మీ ఎదురుచూపులకు బహుమతిగా గొప్ప చిత్రాన్ని అందిస్తామని హామీ ఇస్తున్నాము.”

మరోవైపు, సామాజిక మాధ్యమాల్లో ‘హరి హర వీరమల్లు’ చిత్రం గురించి తప్పుడు వార్తలు ప్రచారమవ్వడం మేము గమనించాము. చాలామంది తమకు తోచినది రాసేస్తున్నారు. ధృవీకరించని వార్తలను నమ్మవద్దని, వాటిని వ్యాప్తి చేయవద్దని మేము ప్రతి ఒక్కరినీ కోరుతున్నాము.

దయచేసి మా అధికారిక హ్యాండిల్స్ ద్వారా మాత్రమే సినిమాకి సంబంధించిన అప్డేట్ల కోసం వేచి ఉండండి. అప్పటి వరకు, ఎటువంటి ప్రచారాలను నిజమని భావించకండి.

‘హరి హర వీరమల్లు’ చిత్రం ఒక అద్భుతమైన ప్రయాణం. వందలాది మంది కళాకారులు, సాంకేతిక నిపుణులు కలిసి వెండితెరపై అద్భుతాన్ని సృష్టించడానికి 24 గంటలూ తమ శక్తికి మించి కృషి చేస్తున్నారు.

ఈ ఆలస్యం మన సహనాన్ని పరీక్షించవచ్చు. కానీ, అంతకంటే గొప్పది ఏదో రూపుదిద్దుకుంటుందని కూడా ఇది సూచిస్తుంది. ప్రతి దృశ్యం ఆశ్చర్యపరిచేలా, ప్రతి శబ్దం ప్రతిధ్వనించేలా, ప్రతి సన్నివేశం ఎప్పటికీ గుర్తుండిపోయేలా చేయాలనే లక్ష్యంతో చిత్ర బృందం నిర్మాణాంతర కార్యక్రమాలతో ముందుకు సాగుతోంది.

‘హరి హర వీరమల్లు’ యొక్క భారీ మరియు శక్తివంతమైన థియేట్రికల్ ట్రైలర్ త్వరలో విడుదల కానుందని తెలియజేయడానికి మేము చాలా సంతోషిస్తున్నాము. ట్రైలర్‌తో పాటు, కొత్త విడుదల తేదీని కూడా తెలియజేస్తాము. కాబట్టి భారీ ప్రకటన కోసం వేచి ఉండండి. సినిమాపై రోజురోజుకి అంచనాలు పెరిగిపోతున్నాయి. అద్భుతమైన ట్రైలర్ ను మీతో పంచుకోవడానికి మేము ఆసక్తిగా ఎదురు చూస్తున్నాము. అద్భుతాన్ని చూడటానికి సిద్ధంగా ఉండండి.

ఈ చిత్రానికి ఎ.ఎం. జ్యోతి కృష్ణ, క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా అటు విజువల్ పరంగానూ, ఇటు మ్యూజిక్ పరంగానూ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని కలిగించనుంది.

జ్ఞాన శేఖర్ వి.ఎస్. మరియు మనోజ్ పరమహంస ఛాయాగ్రాహకులుగా వ్యవహరిస్తున్నారు. ప్రవీణ్ కె.ఎల్. ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ప్రతిభగల సాంకేతిక బృందం మద్దతుతో ఈ చిత్రం అద్భుతంగా రూపుదిద్దుకుంటోంది.

మెగా సూర్య ప్రొడక్షన్ పతాకంపై ఎ. ఎం. రత్నం చిత్ర సమర్పకులు గా,
ఎ. దయాకర్ రావు నిర్మాతగా ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ మాగ్నమ్ ఓపస్ అభిమానులు, సినీ ప్రియుల హృదయాల్లో ఎప్పటికీ నిలిచిపోయే చిత్రంగా రూపొందుతోంది.

మీ నిరంతర మద్దతు, ప్రేమ, ఓర్పుకు మా హృదయపూర్వక కృతజ్ఞతలు. తుఫాను అతి త్వరలో రాబోతోంది. చరిత్ర సృష్టించడానికి సిద్ధమవుతోంది.

 

 

 

Tags
  • AM Ratnam
  • Hari Hara Veera Mallu
  • Jyothi Krishna
  • Keeravani
  • Nidhi Agarwal

Related News

  • Megastar Chiranjeevi About Kishkindhapuri

    Kishkindhapuri: కిష్కింధపురి సినిమా చాలా బావుంది – మెగాస్టార్ చిరంజీవి

  • Telusu Kadaa Movie Shooting Completed

    Telusu Kadaa!: సిద్ధు జొన్నలగడ్డ ‘తెలుసు కదా’ షూటింగ్ పూర్తి

  • Prabhutvasaraidukaanam Teaser Unveiled Women Power Takes Centre Stage In Rural Politics

    Prabhuthva Sarai Dukanam: స్త్రీలు కీలకపాత్ర పోషిస్తే ఎలా ఉంటుందో సరి కొత్తగా చూపిస్తూ ‘ప్రభుత్వ సారాయి దుకాణం’ చిత్ర టీజర్

  • Under The Auspices Of Telangana Film Development Corporation Bathukamma Young Filmmakers Challenge

    Dil Raju: తెలంగాణ ఫిల్మ్ డెవ‌ల‌ప్‌మెంట్ కార్పొరేష‌న్ ఆధ్వ‌ర్యంలో… బ‌తుకమ్మ యంగ్ ఫిల్మ్ మేక‌ర్స్ ఛాలెంజ్‌…

  • Priyanka Arul Mohan Disappoints Pawan Fans

    Priyanka Arul Mohan: ప‌వ‌న్ ఫ్యాన్స్ ను డిజ‌ప్పాయింట్ చేసిన ప్రియాంక‌

  • Peddi Viji Chandrasekhar Joins Ram Charans Biggie To Play A Key Role

    Viji: అప్పుడు బాల‌య్య‌కు త‌ల్లిగా, ఇప్పుడు చ‌ర‌ణ్ కు త‌ల్లిగా

Latest News
  • Kishkindhapuri: కిష్కింధపురి సినిమా చాలా బావుంది – మెగాస్టార్ చిరంజీవి
  • Telusu Kadaa!: సిద్ధు జొన్నలగడ్డ ‘తెలుసు కదా’ షూటింగ్ పూర్తి
  • Priyanka Arul Mohan: ‘ఓజీ’ సినిమాలో ‘కణ్మని’ పాత్రకి నా మనసులో ఎప్పటికీ ప్రత్యేక స్థానముంటుంది- ప్రియాంక అరుళ్ మోహన్
  • Prabhuthva Sarai Dukanam: స్త్రీలు కీలకపాత్ర పోషిస్తే ఎలా ఉంటుందో సరి కొత్తగా చూపిస్తూ ‘ప్రభుత్వ సారాయి దుకాణం’ చిత్ర టీజర్
  • Dil Raju: తెలంగాణ ఫిల్మ్ డెవ‌ల‌ప్‌మెంట్ కార్పొరేష‌న్ ఆధ్వ‌ర్యంలో… బ‌తుకమ్మ యంగ్ ఫిల్మ్ మేక‌ర్స్ ఛాలెంజ్‌…
  • UNO: గాజాలో ఇజ్రాయెల్ మారణహోమం.. ఐక్యరాజ్యసమితి సంచలన నివేదిక
  • Padi Kaushik Reddy: పాడి కౌశిక్ రెడ్డి చౌకబారు విమర్శలు..! నవ్వాలా.. ఏడవాలా..!?
  • Ukraine: పుతిన్ వ్యూహాల ముందు ట్రంప్ తేలిపోతున్నారా..? జెలెన్ స్కీ మాటల అర్థమేంటి..?
  • YS Viveka Case: వివేకా హత్య కేసులో ట్విస్ట్.. దర్యాప్తుకు సీబీఐ మళ్లీ రెడీ..!
  • Prashant Kishore: బిహార్ కింగ్ మేకర్ ఎవరవుతారో…?
  • FaceBook
  • Twitter
  • WhatsApp
  • instagram
Telugu Times

Advertise with Us !!!

About Us

‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.

  • Real Estate
  • Covid-19
  • Business News
  • Events
  • e-paper
  • Topics
  • USA NRI News
  • Shopping
  • Bay Area
  • Dallas
  • New Jersey
  • New York
  • Washington DC
  • USA Politics
  • Religious
  • Navyandhra
  • Telangana
  • National
  • International
  • Political Articles
  • Cinema News
  • Cinema Reviews
  • Cinema-Interviews
  • Political Interviews

Copyright © 2000 - 2024 - Telugu Times

  • About Us
  • Contact Us
  • Terms & Conditions
  • Privacy Policy
  • Advertise with Telugutimes
  • Disclaimer