మైత్రీకి పెరుగుతున్న డిస్ట్రిబ్యూషన్ డిమాండ్!
సినిమాల నిర్మాణంలో అగ్రస్థానంలో నిలిచిన మైత్రీ మూవీ మేకర్స్(Mythri movie makers).. ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్ రంగంలోనూ తన పరిధిని వేగంగా విస్తరిస్తోంది. నైజాం ఏరియాలో సొంత సినిమాల డిస్ట్రిబ్యూషన్ తో మొదలైన ఈ ప్రయాణం, ఇతర నిర్మాతల సినిమాలను కూడా ఆడియన్స్ ముందుకు తీసుకెళ్లే స్థాయికి చేరుకుంది. సింగిల్ స్క్రీన్లను లీజుకు తీసుకుని వాటిలో పెట్టుబడులు పెట్టడం, థియేటర్లను రీమోడల్ వంటి స్ట్రాటజీలతో ఈ సంస్థ డిస్ట్రిబ్యూషన్ మార్కెట్లో తన ఉనికిని బలపరుచుకుంది.
నైజాం మార్కెట్ దాటి తమిళ, కన్నడ, మలయాళ సినిమాల తెలుగు థియేట్రికల్ రైట్స్ ను సైతం మైత్రీ సొంతం చేసుకుంటోంది. హృదయం మురళి(Hrudayam murali), చెన్నై లవ్ స్టోరీ(Chennai love story), విశ్వనాథ్ అండ్ సన్స్(Viswanath and sons), ఎపిక్(Epic), బెత్లెహెం కుటుంబ యూనిట్(Bethlehem kutumba unit), మండాడి(mandadi) వంటి సినిమాల రిలీజులతో ఈ విభాగంలో మంచి ఎక్స్‌పీరియెన్స్‌ను సంపాదించింది. ప్రస్తుతం నాని(nani) ది ప్యారడైజ్(the paradise), వెంకటేష్(Venkatesh) ఆదర్శ కుటుంబం(Aadarsha kutumbam) వంటి క్రేజీ ప్రాజెక్టులు కూడా నైజాంలో మైత్రీ ద్వారా ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.
తక్కువ టైమ్ లోనే నైజాం, ఆంధ్రప్రదేశ్ మార్కెట్లలో స్ట్రాంగ్ డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్‌ను మైత్రీ నిర్మించుకోవడం ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. వ్యాపార లావాదేవీల్లో పారదర్శకతకు ప్రాధాన్యత ఇవ్వడం వల్ల పలువురు నిర్మాతలు తమ సినిమాల పంపిణీ బాధ్యతలను మైత్రీకి అప్పగిస్తున్నట్లు తెలుస్తోంది. రాబోయే రోజుల్లో మరిన్ని భారీ సినిమాలను డిస్ట్రిబ్యూషన్లోకి తీసుకురావడం ద్వారా ఈ విభాగంలో మరింత దూకుడుగా ముందుకు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి.








