గోపీచంద్ కు మరోసారి ప్రభాస్ సాయం
మ్యాచో స్టార్ గోపీచంద్ గత పదేళ్ల నుంచి సక్సెస్ ను చూసింది లేదు. ఆయన ఆఖరిగా హిట్ అందుకుంది 2014లో జిల్ సినిమాతో. ఆ సినిమా తర్వాత గోపీచంద్ దాదాపు పది సినిమాలు చేశాడు కానీ అందులో ఏదీ హిట్ అయింది లేదు. దానికి కారణం గోపీ చేస్తున్న సినిమాలన్నీ రెగ్యులర్ కమర్షియల్ కథలే అవడం.
ఒకప్పుడు మాస్ ఆడియన్స్ లో గోపీచంద్‌కు మంచి క్రేజ్ ఉండేది కానీ ఇప్పుడు వరుస ఫ్లాపులతో ఆ క్రేజ్ మెల్లిగా తగ్గుతూ వస్తుంది. తన మార్కెట్ పై కూడా ఈ ఎఫెక్ట్ కనిపిస్తుంది. దీంతో మిగిలిన హీరోల్లాగా గోపీచంద్ కూడా కొత్త కథలను ఎంచుకుని ప్రయోగాలు చేస్తే తప్పించి మళ్లీ తన క్రేజ్ పెరిగి ఆడియన్స్ ఫోకస్ ఎక్కువగా పడదని అంటున్నారు.
ప్రస్తుతం శ్రీను వైట్ల దర్శకత్వంలో విశ్వాసం అనే సినిమా చేస్తున్న గోపీచంద్ కు ఇప్పుడు మరోసారి ప్రభాస్ సపోర్ట్ తో ఓ కొత్త ప్రాజెక్ట్ వచ్చినట్లు తెలుస్తోంది. ప్రభాస్ ఫ్రెండ్స్ తో కలిసి యువి క్రియేషన్స్ ను నడుపుతున్న విషయం తెలిసిందే. ఈ బ్యానర్ లో ప్రభాస్ ఇన్వాల్వ్మెంట్ డైరెక్ట్ గా లేకపోయినప్పటికీ ఆయన సలహాలు సూచనలు మాత్రం తప్పక ఉంటాయి.
ప్రభాస్ సలహా మేరకే గతంలో యువి క్రియేషన్స్ గోపీచంద్ తో జిల్ తీశారు. ఆ సినిమా ఫ్లాప్ అయింది. ఆ తర్వాత పక్కా కమర్షియల్ అనే సినిమాను తీశారు. అది డిజాస్టర్ అయింది. అయినప్పటికీ ముచ్చటగా మూడో సారి యువి బ్యానర్ గోపీచంద్ తో సినిమా తీయడానికి రెడీ అయింది. అది కూడా జిల్, రాధే శ్యామ్ డైరెక్టర్ రాధా కృష్ణతోనే. రాధేశ్యామ్ ఫ్లాప్ అయినప్పటికీ ప్రభాస్ కు రాధాకృష్ణ వర్క్ నచ్చి మరో ఛాన్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది. భారీ బడ్జెట్ తో రూపొందనున్న ఈ సినిమా అవకాశాన్ని మరి గోపీ, రాధాకృష్ణ ఎలా వాడుకుంటారో చూడాలి.













