War2: వార్2 నుంచి త్వరలోనే ఫస్ట్ సింగిల్

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్(NTR), బాలీవుడ్ హ్యాండ్‌సమ్ హంక్ హృతిక్ రోషన్(Hrithik Roshan) కలిసి అయాన్ ముఖర్జీ(Ayaan Mukharjee) దర్శకత్వంలో చేస్తున్న సినిమా వార్2(War2). బ్లాక్ బస్టర్ వార్ సినిమాకు సీక్వెల్ గా వస్తోన్న ఈ సినిమాపై అందరికీ భారీ అంచనాలున్నాయి. ఇద్దరు టాలెంటెడ్ నటులు కలిసి నటిస్తున్న సినిమా కావడంతో యావత్ భారతదేశం మొత్తం వార్2 కోసం ఎదురుచూస్తుంది.
ఆగస్ట్ 14న వార్2 ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. అంటే వార్2 రిలీజ్ కు మరో నెల మాత్రమే టైముంది. ఈ లోపు సినిమా నుంచి చాలానే అప్డేట్స్ రావాల్సి ఉన్నాయి. అందులో భాగంగా అన్నింటి కంటే ముందు వార్2 నుంచి ఫస్ట్ సింగిల్ రానున్నట్టు బాలీవుడ్ మీడియా వర్గాల నుంచి అప్డేట్ వినిపిస్తోంది. వార్2 సినిమాకు ప్రీతమ్(preetham) సంగీతం అందిస్తున్నాడు.
బాలీవుడ్ ఫిల్మ్ సర్కిల్స్ ప్రకారం వార్2 నుంచి వచ్చే ఫస్ట్ సింగిల్ ఓ రొమాంటిక్ సాంగ్ అని తెలుస్తోంది. అంతేకాదు, ఆ ఫస్ట్ సింగిల్ కూడా ఈ వారమే రానున్నట్టు టాక్ వినిపిస్తోంది. ఆల్రెడీ టీజర్ లోని తన బీజీఎంతో అందరినీ ఆకట్టుకున్న ప్రీతమ్ వార్2 కోసం ఎలాంటి సాంగ్స్ ఇచ్చారో చూడాలి. కియారా అద్వానీ(Kiara Advani) హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను యష్ రాజ్ ఫిల్మ్స్(Yash Raj Films) భారీ బడ్జెట్ తో నిర్మించింది.