Suriya: సూర్య సినిమాలో ఫహద్ ఫాజిల్?

తమిళ నటుడు అయినప్పటికీ సూర్య(suriya)కు తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. అతని సినిమాలు వస్తున్నాయంటే తెలుగు ఆడియన్స్ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. అలాంటి సూర్యకు గత కొన్ని సినిమాలుగా ఆశించిన ఫలితాలు దక్కడం లేదు. ఆయనేం చేసినా ఫలితం బెడిసి కొడుతుంది తప్పించి సక్సెస్ మాత్రం దక్కడం లేదు.
ఆఖరిగా రెట్రో(retro) సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించిన సూర్య, ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. కరుప్పు(Karuppu) సినిమాతో పాటూ టాలీవుడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి(venky atluri)తో సినిమా చేస్తున్న సూర్య లైనప్ లో జీతూ మాధవన్(jeethu madhavan) దర్శకత్వంలో చేయాల్సిన సినిమా కూడా ఉన్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు సూర్య- జీతూ కాంబినేషన్ లో రానున్న సినిమాపై ఓ అప్డేట్ వినిపిస్తోంది.
ఈ క్రేజీ ప్రాజెక్టులో మలయాళ టాలెంటెడ్ యాక్టర్ ఫహద్ ఫాజిల్(fahadh faasil) నటించనున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో సూర్య పవర్‌ఫుల్ పోలీస్ రోల్ లో నటించనున్నాడని అంటున్నారు. అయితే సూర్య- జీతూ సినిమాలో ఫహద్ నటించనున్నాడని వస్తున్న వార్తలపై క్లారిటీ రావాల్సి ఉంది. ఇక పోతే, సూర్య నటిస్తున్న కరుప్పు సినిమాను సంక్రాంతి బరలో దింపాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు కోలీవుడ్ మీడియాలో కథనాలు వస్తున్నాయి.