తమిళ హీరో, డీఎండీకే అధినేత విజయకాంత్ కన్నుమూత
తమిళ హీరో, డీఎండీకే అధినేత కెప్టెన్ విజయకాంత్ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన గతంలో కూడా ఆసుపత్రిలో చికిత్స పొందారు. ప్రస్తుతం మళ్లీ ఆయన కరోనా సోకడంతో ఇబ్బంది పడుతున్న క్రమంలో మళ్లీ చెన్నైలోని మియోట్ దవాఖానలో చేరారు. ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడుతుండటంతో వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందించినప్పటికీ లాభం లేకుండా పోయింది. పరిస్థితి విషమించడంతో విజయకాంత్ తుదిశ్వాస విడిచారు. ఈ మేరకు తమిళనాడు ఆరోగ్య శాఖ కార్యదర్శి ప్రకటించారు. దీంతో ఒక్కసారిగా తమిళ ఇండస్ట్రీతో పాటు, రాజకీయ శ్రేణుల్లో విశాదం నెలకొంది. మరోవైపు సోషల్ మీడియాలో పలువురు సినీ పెద్దలు విజయకాంత్ కుటుంబానికి ప్రగాడ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు.













