లక్ అంటే ఆయనదే..
తమిళంలో డిఫరెంట్ స్టోరీలను ఎంచుకుని కమర్షియల్ హిట్స్ అందుకున్న వెంకట్ ప్రభు తన సినిమాలతో మెజారిటీ ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేశాడు. అలాంటి మంచి ట్రాక్ రికార్డున్న వెంకట్ ప్రభు, అక్కినేని నాగచైతన్యతో సినిమా చేస్తున్నాడని తెలిసి అక్కినేని ఫ్యాన్స్ తో పాటూ అందరూ కూడా చాలా ఎగ్జయిట్ అయ్యారు.
ఈ సినిమాతో చైతూ సాలిడ్ కంబ్యాక్ ఇస్తాడని, తమిళంలో కూడా మంచి మార్కెట్ ఏర్పరచుకుంటాడని ఫ్యాన్స్ ఆశించారు. కానీ ఫలితం చూస్తే ఆ సినిమా డిజాస్టర్ గా మిగిలింది. చైతూ కెరీర్ కు ఈ సినిమా ఓ మాయని మచ్చలా మిగిలిపోయింది. అసలు ఈ సినిమా మొత్తం మీద ఎక్కడా డైరెక్టర్ మార్క్ కనిపించకపోవడం ఆశ్చర్యకరం.
అయితే ఇలాంటి డిజాస్టర్ తర్వాత ఎవరి కెరీర్ అయినా స్లో అవడం సహజం. కానీ వెంకట్ ప్రభు కి మాత్రం అదృష్టం శనిలా దాపురించింది. కస్టడీ ఫలితాన్ని అసలు కేర్ చేయకుండా ఆయనతో సినిమా చేయడానికి తమిళ స్టార్ హీరో విజయ్ ఓకే అన్నాడట. వీరి కాంబోలో సినిమా ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయినట్లు తమిళ ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం లోకేష్ కనగరాజ్‌తో లియో సినిమా చేస్తున్న విజయ్, ఆ సినిమా అయ్యాక వెంకట్ ప్రభుతోనే సెట్స్ పైకి వెళ్లనున్నాడని కోలీవుడ్ వర్గాలు చెప్తున్నాయి.













