D54: ధనుష్ 54 రిలీజ్ ఎప్పుడంటే?

తమిళ స్టార్ హీరో ధనుష్(dhanush) వరుస సినిమాలతో చాలా బిజీగా ఉన్నారు. రీసెంట్ గా ఇడ్లీ కడై(Idli kadai) సినిమాతో హీరోగా, డైరెక్టర్ గా ప్రేక్షకుల ముందుకొచ్చిన ధనుష్ ఆ సినిమా తర్వాత తన 54వ సినిమాను పోర్ తొళిల్(por thozhil) అనే థ్రిల్లర్ తో హిట్ అందుకున్న విఘ్నేష్ రాజా(vignesh raja) దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆ సినిమా నుంచి వచ్చిన పోస్టర్లకు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.
యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ మూవీకి మేకర్స్ ఇంకా టైటిల్ ను ఫిక్స్ చేయలేదు. వేల్స్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్(Vels films internaitonal) బ్యానర్ లో ఇషారి కె. గణేష్(ishari k ganesh) భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ మూవీకి జీవీ ప్రకాష్(GV Prakash) సంగీతం అందిస్తుండగా, ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఒకటి కోలీవుడ్ ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది.
ధనుష్, విఘ్నేష్ రాజా కలయికలో వస్తున్న D54 సినిమా షూటింగ్ పూర్తైందని, ఈ సినిమాను వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారని తెలుస్తోంది. కాగా ఈ మూవీలో ప్రేమలు ఫేమ్ మమిత బైజు(mamitha baiju), ధనుష్ కు జోడీగా నటిస్తుండగా, జయరామ్(jayaram), వెంజరమూడు(venjaramoodu), కేఎస్ రవికుమార్(KS Ravikumar) కీలక పాత్రల్లో కనిపించనున్నారు.