Devadasu: 72 ఏళ్లు పూర్తి చేసుకున్న ఏఎన్నార్ క్లాసికల్ మూవీ దేవదాసు

టాలీవుడ్ కు మూల స్థంభమైన అక్కినేని నాగేశ్వరరావు(Akkineni nageswara rao) ఎన్నో గొప్ప సినిమాలు చేయగా అందులో దేవదాసు(Devadasu) కూడా ఒకటి. 1953, జూన్ 26న రిలీజైన ఈ సినిమా నేటికి 72 ఏళ్లు పూర్తి చేసుకుంది. వేదాంతం రాఘవయ్య(Vedantham raghavayya) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో ఏఎన్నార్(ANR) సరసన సావిత్రి(Savitri) నటించగా, ఈ సినిమా బెంగాలీ నవల దేవదాస్(devadas) ఆధారంగా తెరకెక్కింది.
ఈ సినిమా కేవలం తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా రిలీజై అక్కడ కూడా మంచి హిట్ గా నిలవడంతో పాటూ కల్ట్ స్టేటస్ ను అందుకుంది. గతేడాది ఏఎన్నార్ శతజయంతి సందర్భంగా దేవదాస్ సినిమాను రీరిలీజ్ చేయగా, ఈ తరం ఆడియన్స్ నుంచి కూడా దేవదాసుకు మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమా రిలీజై 72 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా అన్నపూర్ణ స్టూడియోస్(Annapurna Studios) ఓ స్పెషల్ వీడియోను ట్విట్టర్ లో పోస్ట్ చేసింది.
ఆ వీడియోలో దేవదాసు సినిమాలోని కొన్ని క్లిప్పింగ్స్ తో పాటూ సినిమా సాధించిన రికార్డులను కూడా చూపించారు. ఈ సినిమా తరతరాలుగా హృదయాలను తాకే క్లాసిక్ గా నిలిచిపోయిందని, ఇండియన్ సినిమాలో అత్యధిక రీరిలీజ్‌లు కలిగిన కళాఖండంగా దేవదాసు నిలుస్తుందని, దేవదాసు రిలీజై ఎన్నేళ్లవుతున్నా కొన్ని కథలు మాత్రం ఎప్పటికీ కొత్తగానే ఉంటాయని ఆ వీడియో ద్వారా తెలిపారు.
https://x.com/AnnapurnaStdios/status/1938091810334929032