కరోనా ఎఫెక్ట్ తో ‘ఆచార్య’ విడుదల జాప్యం?
2019 లో విడుదలైన సైరా నరసింహారెడ్డి మూవీ తర్వాత మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆయన నటిస్తున్న సినిమా ఆచార్య. తొలిసారిగా తనయుడు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తో కలిసి మెగాస్టార్ నటిస్తున్న ఈ సినిమాని మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్, కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ సంస్థలు ఎంతో భారీ లెవెల్లో అత్యధిక ఖర్చుతో నిర్మస్తున్నాయి. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్డే కూడా ఒక ముఖ్య పాత్ర చేస్తోంది. ఇక ఇటీవల ఈ సినిమా నుండి మణిశర్మ కంపోజ్ చేసిన లాహే లాహే అనే సాంగ్ రిలీజ్ అయి శ్రోతలను విశేషంగా ఆకట్టుకుంది. మరోవైపు ఈ సినిమా పై మెగాఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ లో కూడా భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి. మెగాస్టార్ చిరంజీవి ఇందులో ఆచార్య అనే మాజీ నక్సలైట్ పాత్ర చేస్తున్నారని, అలానే ఈ సినిమా మంచి మెసేజ్ తో కూడిన భారీ యాక్షన్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా రూపొందుతుందని అంటున్నారు. కాగా ఈ సినిమాని వేసవి కానుకగా మే 13న రిలీజ్ చేస్తున్నాం అంటూ ఇటీవల యూనిట్ అధికారికమ్ గా ప్రకటించింది.
అయితే లేటెస్ట్ గా పలు టాలీవుడ్ వర్గాల నుండి మరో విధం గా వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం మన దేశంతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా కరోనా సెకండ్ వేవ్ ఉదృతంగా కొనసాగుతున్న నేపథ్యంలో సినిమా ని ఇప్పట్లో రిలీజ్ చేయకూడదని, పరిస్థితులు కొంత చక్కబడిన తరువాత ఒక నెల అనంతరం అనగా జూన్ 4న తమ మూవీ ని రిలీజ్ చేయాలని ఆచార్య యూనిట్ ఆలోచన చేస్తుందని అంటున్నారు. మరి దీనిలో ఎంతవరకు వాస్తవం ఉందొ తెలియాలి అంటే అధికారిక ప్రకటన వస్తే గాని తెలియదు.













