ఛపాక్ లో దీపిక ఫస్ట్ లుక్ విడుదల
ఢిల్లీకి చెందిన యాసిడ్ బాధితురాలు లక్ష్మీ అగర్వాల్ కథతో ఓ బయోపిక్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ నటి దీపికా పడుకోన్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాకు ఛపాక్ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ సినిమా షూటింగ్ మొదలైంది. ఈ సందర్భంగా ఫస్ట్‌లుక్‌ను, ఇందులో తన క్యారెక్టర్‌ను దీపిక ట్విటర్ వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ఇందులో పోషిస్తున్న మాలతి పాత్ర తన కెరీర్లో నిలిచిపోతుందని దీపిక రాసుకొచ్చారు. ఈ లుక్ విడుదలైన కొద్ది క్షణాల్లోనే వేలల్లో లైకులు, షేర్లు వచ్చాయి. రాజీ సినిమాతో బ్లాక్‌బస్టర్ విజయం అందుకున్న మేఘనా గుల్జార్ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న ఈ చిత్రానికి దీపిక కూడా ఓ నిర్మాత. విక్రాంత్ మస్సే ఆమెకు జోడీగా నటిస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి 10న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.













