దీపికా పదుకొణేకు అరుదైన గౌరవం
పద్మావత్ చిత్రంలో రాణి పద్మావతిగా నటించి మెప్పించిన అందాల నటి దీపికా పదుకొణే. తన సినిమాలకి సంబంధించి విశేషాలతో పాటు పర్సనల్ విషయాలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసుకునే దీపికాని 22.4 మిలియన్ ఫాలో అవుతున్నారు. ఈ క్రమంలో ఇన్స్టాగ్రామ్ ఇండియా మోస్ ఫాలోవుడ్ ఎకౌంట్ టైటిల్‌ని దీపికకి కట్టబెట్టింది. దీనిపై దీపిక సంతోషం వ్యక్తం చేసింది. నా ఫ్యాన్స్‌తో పాటు సన్నిహితులకి దగ్గరగా ఉండడం చాలా ఇంపార్టెంట్. వారు చూపించే ప్రేమ, సపోర్ట్‌కి ధన్యవాదాలు అంటూ దీపిక అంది. గ్లోబల్ స్టార్ హీరోయిన్ ప్రియాంక 22 మిలియన్ ఫాలోవర్స్‌తో రెండో స్థానంలో నిలవడం విశేషం. ప్రియాంక చోప్రా తర్వాత అలియా భట్ 20.8 మిలియన్ ఫాలోవర్స్‌తో మూడో స్థానంలో ఉండగా, శ్రద్ధా కపూర్ 20 మిలియన్ ఫాలోవర్స్‌తో నాలుగో స్థానంలో నిలిచింది.













