నాని ‘దసరా’ నుండి ఫ్రెండ్షిప్ డే స్పెషల్ పోస్టర్
నేచురల్ స్టార్ నాని కథానాయకుడిగా, నూతన దర్శకుడు శ్రీకాంత్ ఒదెల దర్శకత్వంలో, శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై నిర్మాత సుధాకర్ చెరుకూరి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న చిత్రం ‘దసరా’. ఈ సినిమాలో నాని మునుపెన్నడూ చేయని మాస్ రోల్లో కనిపిస్తున్నారు. ఈ చిత్రం కోసం మాస్, రగ్డ్ గా మేకోవరైన నాని.. తెలంగాణ యాసలో డైలాగ్స్ చెప్పనున్నారు. అలాగే చిత్ర షూట్లో ఎక్కువ భాగం హ్యుమిడిటీతో కూడిన పరిస్థితులలో జరుగుతుంది. నాని కెరీర్ లో ఫస్ట్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా భారీ స్థాయిలో ‘దసరా’ రూపొందుతోంది. ఫ్రెండ్షిప్ డే సందర్భంగా నాని, అతని గ్యాంగ్‌తో కూడిన ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్.
ఈ పోస్టర్ లో నాని అండ్ కో రెండు రైల్వే ట్రాక్‌ల మధ్య కూర్చొని అందరూ నవ్వుతూ కనిపించారు. అందరిముఖంలో గొప్ప సంతోషం కనిపిస్తున్న ఈ పోస్టర్ ఫ్రెండ్షిప్ డే కి పర్ఫెక్ట్ ట్రీట్ గా నిలిచింది. నాని ఫుల్ లెంత్ మాస్, యాక్షన్-ప్యాక్డ్ పాత్రలకో కనిపిస్తున్న ఈ చిత్రం గోదావరిఖనిలోని సింగరేణి కోల్ మైన్స్ దగ్గర ఉన్న ఒక గ్రామం నేపధ్యంలో జరుగుతుంది. కీర్తి సురేష్ ఈ చిత్రంలో నాని సరసన కథానాయికగా కనిపించనుంది. ఇప్పటికే విడుదలైన స్పార్క్ ఆఫ్ దసరా గ్లింప్స్ కి భారీ రెస్పాన్స్ వచ్చింది నాని మాస్ గెటప్, టెర్రిఫిక్ అవతార్ ప్రేక్షకులని ఆశ్చర్యపరిచింది. సముద్రఖని, సాయి కుమార్, జరీనా వహాబ్ కీలక పాత్రలలో కనిపించనున్న ఈ చిత్రానికి సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫర్ గా, సంతోష్ నారాయణన్ సంగీత దర్శకుడిగా పని చేస్తున్నారు. ఈ చిత్రానికి ఎడిటర్‌గా నవీన్ నూలి, ప్రొడక్షన్ డిజైనర్‌గా అవినాష్ కొల్లా, ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా విజయ్ చాగంటి వ్యవహరిస్తున్నారు ఈ చిత్రం తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కాబోతుంది.
షూటింగ్లో హీరో నానికి తప్పిన ప్రమాదం
సినీ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతున్న సమాచారం మేరకు హీరో నాని షూటింగ్ సమయంలో ఓ పెను ప్రమాదం నుంచి బయట పడ్డారట. అసలు ఏం జరిగింది.. ఏ షూటింగ్లో నాని ప్రమాదం నుంచి బయట పడ్డారనే వివరాల్లోకి వెళితే..విలక్షణమైన సినిమాలు చేస్తూ టాలీవుడ్ హీరోల్లో తనదైన గుర్తింపును దక్కించుకున్న వారిలో నాని ఒకరు. అభిమానులు ఆయన్ని నేచురల్ స్టార్ అని అంటుంటారు. ఒకవైపు హీరోగా సినిమాలు చేస్తూనే ఆయన నిర్మాతగానూ సినిమాలు చేస్తూ వస్తున్నారు. సినీ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతున్న సమాచారం మేరకు హీరో నాని షూటింగ్ సమయంలో ఓ పెను ప్రమాదం నుంచి బయట పడ్డారట. అసలు ఏం జరిగింది.. ఏ షూటింగ్లో నాని ప్రమాదం నుంచి బయట పడ్డారనే వివరాల్లోకి వెళితే..నాని హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘దసరా’ . శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని సింగరేణి బొగ్గు గనుల బ్యాక్‌డ్రాప్‌లో సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా కోసం భారీ విలేజ్ సెట్ వేసి చిత్రీకరిస్తున్నారు. షూటింగ్లో సమయంలో ట్రక్ నుంచి బొగ్గు నానిపై పడింది. ఈ ఘటనతో చిత్ర యూనిట్ ఒక్కసారిగా షాకైంది. అయితే నాని హీరోకి పెద్దగా గాయాలేమీ కాకపోవటంతో యూనిట్ ఊపిరి పీల్చుకుందట. నాని షూటింగ్‌కి బ్రేక్ ఇచ్చారు. కాస్త ఓకే కాగానే మళ్లీ షూటింగ్ స్టార్ట్ అవుతుందని టాక్ వినిపిస్తోంది.













