కిచ్చా సుదీప్ – డైరెక్టర్ ప్రేమ్ మోస్ట్ ఎవైటెడ్ మూవీ టైటిల్ ‘Dada on Holiday’.. టైటిల్ ను లాంచ్ చేసిన కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్
కిచ్చా సుదీప్, దర్శకుడు ప్రేమ్ మోస్ట్ ఎవైటెడ్ కాంబినేషన్ మూవీకి ‘Dada on Holiday’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. బెంగళూరులో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో కర్ణాటక డిప్యూటీ సీఎం శ్రీ డీకే శివకుమార్ ఈ సినిమా టైటిల్‌ను లాంచ్ చేశారు.
ఆరుద్ర సినిమాస్, ఫీనిక్స్ ప్రేమ్ స్టూడియోస్ సమర్పణలో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం కిచ్చా సుదీప్, దర్శకుడు ప్రేమ్ చేతులు కలిపారు. ఎంటర్టైన్మెంట్, ఎమోషన్స్, హ్యూమర్ కలగలిపిన భారీ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఈ సినిమాను రూపొందిస్తున్నారు.
టైటిల్ లాంచ్‌తోనే సినిమాపై ప్రేక్షకుల్లో భారీ ఆసక్తి మొదలైంది. ముఖ్యంగా మేకర్స్ వినూత్నమైన కాన్సెప్ట్స్‌తో రూపొందించిన ప్రమోషనల్ వీడియోలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. ఆ వీడియోల్లోని క్రియేటివ్ ఐడియాలు, వాటి ప్రెజెంటేషన్, కొత్త తరహా ఎగ్జిక్యూషన్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. ఈ ప్రమోషనల్ క్యాంపెయిన్ సినిమా గురించి చర్చ జరిగేలా చేయడంతో పాటు, టైటిల్‌పై క్యూరియాసిటీని మరింత పెంచుతోంది.
ఇవి కూడా చదవండి
కిచ్చా సుదీప్ చరిష్మాటిక్ స్క్రీన్ ప్రెజెన్స్, దర్శకుడు ప్రేమ్ ప్రత్యేకమైన విజన్ కలిసి ‘Dada on Holiday’ ప్రేక్షకులకు ఒక ఆసక్తికరమైన సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అందించనుంది.
టైటిల్ లాంచ్ కావడంతో పాటు ప్రమోషనల్ క్యాంపెయిన్ కూడా మంచి బజ్ క్రియేట్ చేస్తోంది. ప్రేక్షకుల ఆశీస్సులతో ఈ ఆసక్తికరమైన సినిమాటిక్ జర్నీని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ‘Dada on Holiday’’ చిత్రబృందం సిద్ధమవుతోంది.







