Baby makers: జూన్ 2న “కలర్ ఫొటో”, “బేబి” మేకర్స్ కొత్త సినిమా టైటిల్, గ్లింప్స్ రిలీజ్

“కలర్ ఫొటో”, “బేబి” (Baby) వంటి కల్ట్ క్లాసిక్ మూవీస్ ప్రేక్షకులకు అందించిన దర్శక నిర్మాత సాయి రాజేశ్ (Sai Rajesh), ప్రొడ్యూసర్ ఎస్ కేఎన్ కాంబినేషన్ లో మరో క్రేజీ మూవీ తెరకెక్కుతోంది. ఈ చిత్రాన్ని అమృత ప్రొడక్షన్స్, మాస్ మూవీ మేకర్స్ బ్యానర్స్ పై సాయి రాజేశ్, ఎస్ కేఎన్ నిర్మిస్తున్నారు. సాయి రాజేశ్ కథను అందిస్తున్న ఈ చిత్రానికి రవి నంబూరి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ రోజు ఇంట్రెస్టింగ్ పోస్టర్ తో ఈ చిత్ర టైటిల్, గ్లింప్స్ రిలీజ్ అనౌన్స్ మెంట్ చేశారు మేకర్స్.
జూన్ 2వ తేదీ సాయంత్రం 5.04 నిమిషాలకు ఈ సినిమా టైటిల్, గ్లింప్స్ రివీల్ చేయబోతున్నారు.చాలా రోజుల తర్వాత ఈ చిత్రానికి మెలొడీ బ్రహ్మ మణిశర్మ సంగీతాన్ని అందించడం ఈ సినిమాపై అంచనాలు రేకెత్తిస్తుంది. ఈ అనౌన్స్ మెంట్ పోస్టర్ లో ఓ యువ జంట బీచ్ లో నడుచుకుంటూ వెళ్తుండటం, అక్కడే ఉన్న ఓ బండి మీద దిగ్దర్శకుడు బాలచందర్ ఫొటో ఉండటం ఆసక్తిని కలిగిస్తోంది. ఈ జంట ఎవరు అనేది అందరిలో క్యూరియాసిటీ క్రియేట్ చేస్తోంది.