డిఫరెంట్ థ్రిల్లర్ మూవీ “మయూఖ”ను ఓవర్సీస్ లో రిలీజ్ చేస్తున్న కాగ్నెయిర్ సినీ క్రియేషన్స్
ఈ నెల 9న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న “మయూఖ” సినిమా
పాయల్ చెంగప్ప ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా “మయూఖ”. ఈ చిత్రాన్ని ప్రశ్విత ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై శశిధర్ నల్ల నిర్మిస్తున్నారు. శ్రీ తేజ్ ఎస్.కె. దర్శకత్వం వహిస్తున్నారు. “మయూఖ” సినిమా ఈ నెల 9న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. తాజాగా మేకర్స్ ఈ చిత్ర ఓవర్సీస్ రిలీజ్ అప్డేట్ ఇచ్చారు.
కాగ్నెయిర్ సినీ క్రియేషన్స్ సంస్థ “మయూఖ” చిత్రాన్ని ఓవర్సీస్ లో భారీ స్థాయిలో రిలీజ్ చేయబోతోంది. డిఫరెంట్ థ్రిల్లర్ సినిమాగా తెరకెక్కిన “మయూఖ” ప్రమోషనల్ కంటెంట్ తోనే ప్రేక్షకుల దృష్టిని బాగా ఆకర్షించింది. ఒక మంచి సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ ను థియేటర్స్ లో చూడబోతున్న ఫీల్ ఈ చిత్ర ట్రైలర్ తోనే అందరిలో కలిగింది. మరోవైపు ఈ నెల 9న రిలీజ్ కావాల్సిన వెంకటేష్, త్రివిక్రమ్ ఆదర్శ కుటుంబం సినిమా పోస్ట్ పోన్ కావడంతో “మయూఖ”పై మరింత క్రేజ్ పెరిగింది. థ్రిల్లర్స్ ఇష్టపడే ప్రేక్షకులతో పాటు కొత్త తరహా సినిమా చూడాలనుకునే మూవీ లవర్స్ కు ఈ వీకెండ్ “మయూఖ” సినిమా బెస్ట్ ఆప్షన్ గా కనిపిస్తోంది.








