Viswambhara: ఆ పాటను రీమిక్స్ చేస్తున్న చిరూ?

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) హీరోగా టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ వశిష్ట(Vassishta) దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా విశ్వంభర(Viswambhara). వాస్తవానికి ఈ సినిమా ఎప్పుడో రిలీజవాల్సింది కానీ కొన్ని కారణాల వల్ల విశ్వంభర వాయిదా పడుతూ వచ్చింది. ఈ సినిమాలో త్రిష(Trisha) హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. సోషియో ఫాంటసీ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై అందరికీ భారీ అంచనాలున్నాయి.
ఆ అంచనాలతోనే విశ్వంభర ఎప్పుడెప్పుడు రిలీజవుతుందా అని మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ ఉందని గత కొన్నాళ్లుగా సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఆ స్పెషల్ సాంగ్ ను బాలీవుడ్ బ్యూటీ మౌనీ రాయ్(Mouni Roy) తో చేయించాలని కూడా మేకర్స్ డిసైడ్ అయ్యారని కూడా టాక్ వినిపిస్తుంది.
అయితే ఇప్పుడా స్పెషల్ సాంగ్ గురించి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ తెలుస్తోంది. ఆ స్పెషల్ సాంగ్ ఓ రీమిక్స్ సాంగ్ అని, ఆ రీమిక్స్ కూడా చిరంజీవి సినిమాలోనిదే అని అంటున్నారు. చిరంజీవి నటించిన బ్లాక్ బస్టర్ మూవీ అన్నయ్య(Annayya) సినిమాలోని ఆట కావాలా పాట కావాలా సాంగ్ ను ఇప్పుడు కీరవాణి(Keeravani) రీమిక్స్ చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. మరి ఇందులో నిజమెంతన్నది తెలియాల్సి ఉంది.