Chiranjeevi: చిరూ తెలివైన ప్లాన్
టాలీవుడ్ సీనియర్ హీరో, మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. 60 ఏళ్ల వయసులో కూడా యంగ్ హీరోలకు పోటీ ఇస్తున్న చిరూ(Chiru) రీసెంట్ గానే విశ్వంభర(Viswambhara) సినిమాను పూర్తి చేశారు. దీంతో పాటూ అనిల్ రావిపూడి(Anil Ravipudi) దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు చిరూ. మెగా157(Mega157)గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.
సంక్రాంతి కానుకగా మెగా157 రిలీజ్ కానుండగా, దాని కంటే ముందే విశ్వంభరను రిలీజ్ చేయాలని చిరూ చూస్తున్నారు. ఒకవేళ విశ్వంభర లేటైనా తర్వాత వెంటనే మెగా157 రానుంది కాబట్టి ఆ ఎఫెక్ట్ పెద్దగా ఉండదు. ఈ రెండింటి తర్వాత శ్రీకాంత్ ఓదెల(Srikanth Odela)తో చిరూ ఓ సినిమాకు కమిట్ అయిన సంగతి తెలిసిందే. అనౌన్స్మెంట్ తోనే భారీ అంచనాలను క్రియేట్ చేసిన ఈ సినిమా వచ్చే ఏడాది సమ్మర్ తర్వాత సెట్స్ పైకి వెళ్లనుంది.
ఈ లోగా వాల్తేరు వీరయ్య(Waltair Veerayya) ఫేమ్ బాబీ(Bobby)తో ఓ సినిమా చేయనున్నారు చిరూ. ఒకవేళ బాబీతో చేసిన సినిమా ఫ్లాపైనా శ్రీకాంత్ తో చేయబోయే సినిమా చిరూని సేఫ్ చేస్తుంది. ఏదేమైనా వచ్చే మూడేళ్లలో చిరూ నుంచి నాలుగు సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. అన్నీ బావుండి ఈ నాలుగు సినిమాలూ హిట్టైతే మాత్రం మరో పదేళ్ల పాటూ చిరూ వెనక్కి తిరిగి చూసుకునే పనుండదు.













