ChiruBobby: చిరూ బాబీ మూవీ పై లేటెస్ట్ అప్డేట్
గత కొన్ని సినిమాలుగాఈ వరుస ఫ్లాపుల్లో ఉన్న మెగాస్టార్ చిరంజీవి(megastar Chiranjeevi) ప్రస్తుతం వశిష్ట(Vasishta) దర్శకత్వంలో విశ్వంభర (Viswambhara)తో పాటూ అనిల్ రావిపూడి(Anil Ravipudi) దర్శకత్వంలో మెగా157(Mega157) సినిమా కూడా చేస్తున్న సంగతి తెలిసిందే. ఆల్రెడీ విశ్వంభర షూటింగ్ ను పూర్తి చేసిన చిరూ, మెగా157 ను కూడా త్వరలోనే పూర్తి చేయనున్నారు. సంక్రాంతికి మెగా157 రిలీజ్ కానుంది.
అనిల్ రావిపూడి సినిమా తర్వాత కూడా చిరూ వరుస పెట్టి సినిమాలు చేయాలని చూస్తున్నారు. అందులో భాగంగానే ఇద్దరు డైరెక్టర్లను లైన్ లో కూడా పెట్టారు చిరూ. వారిలో ఒకరు దసరా(Dasara) ఫేమ్ శ్రీకాంత్ ఓదెల(Srikanth Odela) కాగా మరొకరు చిరూకి ఆల్రెడీ వాల్తేరు వీరయ్య(Waltair Veerayya)తో మంచి బ్లాక్ బస్టర్ ను ఇచ్చిన బాబీ కొల్లి(Bobby Kolli). వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా ఇంకా అనౌన్స్ అవకపోయినా ఈ వార్త నిజమేనని మెగా వర్గాలు చాలా స్ట్రాంగ్ గా చెప్తున్నాయి.
ఇదిలా ఉంటే ఇప్పుడు చిరూ- బాబీ ప్రాజెక్టుకు సంబంధించి ఓ క్రేజీ న్యూస్ వినిపిస్తోంది. మెగా157 తర్వాత చిరూ చేయబోయే సినిమా బాబీ తోనే అని, ఈ సినిమా 2025 సెప్టెంబర్ నుంచి సెట్స్ పైకి వెళ్లి షూటింగ్ ను జరుపుకోనున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాకు కార్తీక్ ఘట్టమనేని(Karthik Ghattamaneni) సినిమాటోగ్రఫీ అందించనున్నాడని సమాచారం. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే వీలుంది.







