Chiranjeevi: చిరూకి లవ్ ట్రాక్ ఉండదట
ఈ ఇయర్ సంక్రాంతికి వస్తున్నాం(Sankranthiki Vasthunnam) సినిమాతో ప్రేక్షకుల్ని అలరించి భారీ విజయం అందుకున్న అనిల్ రావిపూడి(Anil Ravipudi) తన తర్వాతి సినిమాను చిరంజీవి(chiranjeevi)తో చేయనున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం వైజాగ్ లో చిరంజీవి కోసం ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేస్తున్నాడు అనిల్. దీంతో అనిల్, చిరూ కోసం ఎలాంటి కథను వండుతున్నాడనే దానిపై ఇంట్రెస్ట్ పెరిగిపోతుంది.
ఈ నేపథ్యంలో ఈ మూవీ గురించి ఓ ఇంట్రెస్ట్ బజ్ వినిపిస్తోంది. చిరూ కోసం అనిల్ పక్కా మాస్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ ను సిద్ధం చేస్తున్నాడని, గ్యాంగ్ లీడర్(Gang Leader) మూవీలోని హీరో పాత్ర షేడ్స్ కు కొన్ని మార్పులు చేర్పులు చేసి చిరంజీవి పాత్రను డిజైన్ చేస్తున్నాడని తెలుస్తోంది. అందులో భాగంగానే చిత్ర యూనిట్ ఓ కొత్త యాసపై వర్క్ చేస్తుందని సమాచారం.
అంతేకాదు ఈ మూవీలో ఎలాంటి లవ్ ట్రాక్ కూడా ఉండదట. అనిల్ మార్క్ రైటింగ్ కు చిరూ లాంటి యాక్టర్ తోడైతే ఆ కథ ఎంత బాగా వస్తుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అయితే అనిల్ ఈ సినిమాలో కూడా ఓ సెన్సిటివ్ విషయాన్ని చాలా స్ట్రాంగ్ గా చెప్పాలని డిసైడ్ అయ్యాడట. త్వరలోనే స్క్రిప్ట్ ను పూర్తి చేసి చిరూకి ఫుల్ నెరేషన్ ఇవ్వనున్నాడు అనిల్. ఈ సినిమాకు భీమ్స్ సిసిరోలియో(Bheems Ciciroleo) సంగీతం అందిస్తున్నాడు.













