షురూ అవుతున్న సెలెబ్రెటీ క్రికెట్ లీగ్..
కరోనా పుణ్యమా అని దాదాపు అన్ని ఎంటర్టైన్మెంట్ సోర్సెస్ ఆపేయాల్సి వచ్చింది. ఇప్పుడిప్పుడే అన్ని మళ్ళీ రెగ్యులర్ గా నడుస్తున్నాయి. దాదాపు మూడు సంవత్సరాల తర్వాత సెలబ్రిటీ క్రికెట్ లీగ్ ఈ ఏడాది ప్రారంభం కానుంది. ఎప్పుడూ ఆన్ స్క్రీన్ పై అలరించే తమ అభిమాన తారలు బ్యాట్, బాల్ తో గ్రౌండ్ లోకి అడుగుపెట్టే సమయం ఇది. తమని తాము మర్చిపోయి, సెలబ్రిటీ అనే హోదాని పక్కన పెట్టి చిన్నపిల్లల్లా వారిలోని ప్రతిభని వెలికి తీసేదే ఈ సెలబ్రిటీ క్రికెట్.
ఈ సెలబ్రిటీ క్రికెట్ లీగ్ కోసం, తమ అభిమాన నటుల ఆటని చూడాలని ఎంతో మంది ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు ఆ సమయం రానే వచ్చింది. ఈ క్రికెట్ లీగ్ షెడ్యూల్ రీసెంట్ గా శనివారం రిలీజ్ చేయడం జరిగింది. ఈ లీగ్ లో తెలుగు, తమిళ, కన్నడ, మళయాళ, భోజ్ పూరి, బెంగాలీ, హిందీ, పంజాబీ ఇండస్ట్రీలకు చెందిన పలువురు నటులు పాల్గొననున్నారని సమాచారం. ఫిబ్రవరి 18 నుండి ఈ లీగ్ ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ సెలబ్రిటీ క్రికెట్ కోసం అభిమానులు ఇప్పటినుండే రెడీ అవుతుండడం విశేషం.
ఇక ఈ సెలబ్రిటీ క్రికెట్ కి టాలీవుడ్ కి బ్రాండ్ అంబాసిడర్ గా హీరో విక్టరీ వెంకటేష్ వ్యవహరించనున్నారు. ఇదే తరహాలో బాలీవుడ్ టీం కి సల్మాన్ ఖాన్, కేరళ టీం కి మోహన్ లాల్ బ్రాండ్ అంబాసిడర్స్ గా ఉంటున్నట్లు సమాచారం. ఇక తెలుగు టీం కి కెప్టెన్ గా హీరో అఖిల్ అక్కినేని వ్యవహరిస్తున్నట్లు తెలుస్తుంది. మొత్తానికి ఎప్పుడూ స్క్రీన్ పైనే ఎంటర్టైన్ చేసే హీరోలు, ఇప్పుడు గ్రౌండ్ లో కూడా తన ఫాన్స్ ని ఎంటర్టైన్ చేసేందుకు రెడీ అవుతున్నారు.













