జయప్రకాష్ రెడ్డి మృతిపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో సహా యావత్ సినీ ప్రముఖుల స్పందన..
ప్రముఖ సినీ, రంగస్థల నటుడు జయప్రకాష్ రెడ్డి మృతికి దేశ ప్రధాని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. జయప్రకాష్ రెడ్డి తనదైన ప్రత్యేక నటనా శైలితో అందరినీ ఆకట్టుకున్నారని ప్రధాని మోదీ తెలుగులో ట్వీట్ చేయడం గమనార్హం. ‘‘జయప్రకాష్ రెడ్డి గారు తనదైన ప్రత్యేక నటనా శైలితో అందరినీ ఆకట్టుకున్నారు . తన దీర్ఘ కాల సినీ యాత్రలో ఆయన ఎన్నో మరపురాని పాత్రలు పోషించారు. వారి మరణం సినిమా ప్రపంచానికి తీరని లోటు. వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నాను. ఓం శాంతి’’ అని ప్రధాని తెలుగు లో తన ట్వీట్లో పేర్కొన్నారు. జయప్రకాష్ రెడ్డి మంగళవారం ఉదయం 7 గంటలకు గుంటూరులోని స్వగృహంలో మృతిచెందారు. బాత్రూమ్లో గుండెపోటుతో కుప్పకూలిపోయారు. కుటుంబ సభ్యులు ఆయన్ని ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. ఆయన వయసు 74 సంవత్సరాలు. కరోనా కారణంగా సిసిమా షూటింగ్‌లు నిలిచిపోవడంతో గత కొద్ది నెలలుగా ఆయన గుంటూలో ఉంటున్నారు. జయప్రకాష్ రెడ్డి మృతితో తెలుగు చిత్ర పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆయన మృతిని టాలీవుడ్ జీర్ణించుకోలేకపోతోంది. చాలా మంది నటీనటులు కంటతడి పెట్టుకున్నారు. టాలీవుడ్ ప్రముఖులంతా సోషల్ మీడియా ద్వారా జయప్రకాష్ రెడ్డి మృతికి సంతాపం వ్యక్తం చేశారు.
జయప్రకాష్ రెడ్డి కర్నూలు జిల్లా, ఆళ్లగడ్డ మండలంలోని శిరువెళ్ల గ్రామంలోని వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. తండ్రి సాంబిరెడ్డి సబ్ ఇన్స్పెక్టర్గా పనిచేశారు. నెల్లూరులోని పత్తేకాన్‌పేటలో ఉన్న ప్రాథమిక పాఠశాలలో 1 నుండి 5వ తరగతి వరకు చదివారు. తర్వాత నెల్లూరులోని రంగనాయకులపేట ఉన్నత పాఠశాలలో చేరారు. పదోతరగతిలో ఉండగా నాన్నకు అనంతపురం బదిలీ అయ్యింది. అక్కడ సాయిబాబా నేషనల్ హయ్యర్ సెకండరీ స్కూల్లో ఎస్ఎస్ఎల్సీలో చేరారు జయప్రకాష్ రెడ్డి. చిన్నప్పటి నుంచే నాటకాలంటే ఆయనకు ఆసక్తి. డిగ్రీ తర్వాత ఉపాధ్యాయ శిక్షణ పూర్తి చేసుకుని గణితం ఉపాధ్యాయుడిగా ఉద్యోగంలో చేరారు. జయప్రకాష్ రెడ్డికి దాసరి నారాయణరావు తొలుత అవకాశం ఇచ్చారు. 1988లో విడుదలైన ‘బ్రహ్మపుత్రుడు’ చిత్రంతో వెండితెరకు పరిచయమయ్యారు జయప్రకాష్ రెడ్డి. ఇక, 1997లో విడుదలైన ‘ప్రేమించుకుందాం రా’ చిత్రం విలన్‌గా జయప్రకాష్ రెడ్డికి మంచి పేరు తీసుకునివచ్చింది. తరువాత బాలకృష్ణ హీరోగా వచ్చిన ‘సమరసింహా రెడ్డి’, ‘నరసింహ నాయుడు’ లాంటి విజయవంతమైన సినిమాల్లో విలన్‌గా నటించి మెప్పించారు. కేవలం విలన్‌గానే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్టుగా, కమెడియన్‌గా తెలుగు సినీ పరిశ్రమలో తనదైన ముద్ర వేశారు. 300కు పైగా చిత్రాల్లో నటించారు. ‘జయం మనదేరా’ సినిమాకు జయప్రకాష్ రెడ్డి ఉత్తమ విలన్‌గా నంది అవార్డు అందుకున్నారు.
టాలీవుడ్ ప్రముఖులు చిరంజీవి, బాలకృష్ణ, మోహన్ బాబు, నాగార్జున, దగ్గుబాటి వెంకటేష్, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, అల్లు అర్జున్, నాని,, మంచు విష్ణు, దర్శకుడు రాజమౌళి, జూనియర్ ఎన్టీఆర్, ప్రకాష్ రాజ్, అనిల్ రావిపూడి, దర్శకుడు మారుతీ, రవి తేజ, గోపీచంద్, బెల్లంకొండ సాయి శ్రేనివాస్, రామ్ పోతినేని రకుల్ ప్రీత్ సింగ్ తదితరులు స్పందించారు. ఈ విషయం తెలిసి పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆయన మృతిపై సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
జయప్రకాశ్ రెడ్డి మరణవార్త తెలియగానే డైరెక్టర్ అనిల్ రావిపూడి వెంటనే రియాక్ట్ అయ్యారు. ఆయనతో తనకున్న అనుబంధాన్ని తెలుపుతూ ఆవేదన చెందారు. ”జయప్రకాశ్ రెడ్డి గారితో నా ప్రయాణం ఎంతో ప్రత్యేకమైంది. నేను చేసిన చాలా సినిమాల్లో ఆయన నటించారు. నన్ను తన సొంత మనిషిగా భావించేవారు. ఆయన లేని లోటు పూడ్చలేనిది. నటుడిగా, వ్యక్తిగా జయప్రకాశ్ రెడ్డి గారిని రీ ప్లేస్ చేసే వ్యక్తిలేరు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా” అని పేర్కొంటూ ట్వీట్ చేశారు అనిల్ రావిపూడి.
”అద్భుతమైన నటనతో అందరినీ అలరించిన జయప్రకాష్ రెడ్డి గారు ఇక లేరు అనే వార్త బాధాకరం. ఆయన ఆత్మ కు శాంతి కలగాలని కోరుకుంటున్నాను” అని జూనియర్ ఎన్టీఆర్ పేర్కొన్నారు.
హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ స్పందిస్తూ.. ”జయప్రకాశ్ రెడ్డి మరణం చాలా బాధాకరం. ఆయనతో చాలా సినిమాల్లో కలిసి పని చేశాను. ఆయన కుటుంబ సబ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా” అని పేర్కొన్నారు.
”సహచర నటుడు జయప్రకాష్ రెడ్డి గారు హఠాన్మరణం నన్ను తీవ్రంగా కలచివేసింది. నటనంటే ఆయనకు ప్రాణం. అటు వెండితెరపైన, ఇటు స్టేజ్ నాటకాలలోను పోషించిన పాత్రలకు ప్రాణం పోసిన నటుడాయన. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియ చేస్తున్నాను” అని ప్రకాష్ రాజ్ తన సంతాపాన్ని తెలిపారు.
ఇంకా టాలీవుడ్ చిన్న పెద్ద నటీనటులు, నిర్మాతలు, దర్శకులు సాంకేతిక నిపుణులు ఆయనకు నివాళులు అర్పించారు. .
https://twitter.com/narendramodi/status/1303242606969851907
https://twitter.com/prakashraaj/status/1303183665065725952
https://twitter.com/VenkyMama/status/1303191100069355520
https://twitter.com/tarak9999/status/1303180437531942912
https://twitter.com/urstrulyMahesh/status/1303184241413337089
https://twitter.com/AnilRavipudi/status/1303162138215608321
https://twitter.com/ramsayz/status/1303191427187314688
https://twitter.com/actor_nithiin/status/1303195719327596545
https://twitter.com/haarikahassine/status/1303187311438356480
https://twitter.com/SureshProdns/status/1303183779662499840
https://twitter.com/RaviTeja_offl/status/1303187461841981441
https://twitter.com/Mehreenpirzada/status/1303189714204205056
https://twitter.com/megopichand/status/1303171603841216512
https://twitter.com/Rakulpreet/status/1303169184361099264
https://twitter.com/themohanbabu/status/1303212640836022272?s=12
https://twitter.com/ssrajamouli/status/1303205309310054402
https://twitter.com/alluarjun/status/1303216387150675968?s=08
https://twitter.com/DirectorMaruthi/status/1303272983646019584
https://twitter.com/iVishnuManchu/status/1303198198593327105
https://twitter.com/SreenuVaitla/status/1303191423974547456
https://twitter.com/BSaiSreenivas/status/1303235346327511041
https://twitter.com/NameisNani/status/1303226595386171393?s=19













